మూడవ భాగము
055 మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా
మద్భావా మానసా జాతా యేషాఁ లోక ఇమాః ప్రజాః (10:06)
కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది
మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందలి
సమస్త భూతములును జన్మించెను.
056 మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం
కథయంతశ్చ మాఁ నిత్యఁ తుష్యంతి చ రమంతి చ (10:09)
పండితులు నాయందు చిత్తముగలవారై నా యందే తమ ప్రాణములుంచి నా
మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొంచు బ్రహ్మా
నందమును అనుభవించుచున్నారు.
057 అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యఁ చ భూతానామంత ఏవ చ (10:20)
సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని
ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను.
058 వేదానాఁ సామవేదోస్మి దేవానామస్మి వాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా (10:22)
వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు,
ప్రాణులందరి బుద్ధి నేనే.
059 ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాఁ కాలః కలయతామహం
మృగాణాఁ చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం (10:30)
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము,
పక్షులలో గరుత్మంతుడు నేనే.
060 యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్చ్హ త్వం మమ తేజోఁశసంభవం (10:41)
లోకమునందు ఐశ్వర్య యుక్తమై, పరాక్రమ యుక్తమై, కాంతి యుక్తమైన
సమస్త వస్తువులు నా తేజో భాగము వలననే సంప్రాప్తమగును.
061 పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ (11:05)
పార్థా! దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై అనేక విశేషములగు
నా అస్వస్వరూపమును కన్నులారా దర్శింపుము.
062 పశ్యామి దేవాఁస్తవ దేవ దేహే, సర్వాఁస్తథా భూతవిశేషసఙ్ఘాన్
బ్రహ్మాణమీశం కమలాసనస్థం, ఋషీఁశ్చ సర్వానురగాఁశ్చ దివ్యాన్ (11:15)
అనేకబాహూదరవక్త్రనేత్రఁ పశ్యామి త్వాఁ సర్వతోనంతరూపం
నాంతం న మధ్యం న పునస్తవాదిఁ పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప (11:16)
దఁష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస (11:25)
దేవా! ఎల్ల దేవతలూ, ఎల్ల ప్రాణులూ, బ్రహ్మాదులూ, ఋషీశ్వరులూ,
వాసుకీ మొదలగుగా గల సర్పములూ నీయందు నాకు గోచరమగుచున్నవి.
ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో
ఒప్పియున్నది. అట్లైయూ నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింప జాల
కున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను
చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నాయందు దయ
యుంచి నాకు ప్రసన్నుడవు గమ్ము. కృష్ణా! ప్రసన్నుడవు గమ్ము.
అర్జునా!
063 కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః
ఋతేపి త్వాఁ న భవిష్యంతి సర్వే యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః (11:32)
అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్ఠమైన కాల స్వరూపుడను
నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్ననూ - బ్రతుక
గలవారిందెవ్వరునూ లేరు.
064 ద్రోణఁ చ భీష్మఁ చ జయద్రథఁ చ కర్ణఁ తథాన్యానపి యోధవీరాన్ మయా హతాఁస్త్వఁ జహి మావ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ (11:34)ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాధి యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శతృ వీరులను నీవు సంహరింపుము.
065 కిరీటినం గదినఁ చక్రహస్తం ఇచ్చ్హామి త్వాఁ ద్రష్టుమహం తథైవ
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే (11:46)
అనేక భుజములుగల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము, గద,
చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరు
చున్నాను కృష్ణా!
066 సుదుర్దర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ
దేవా అప్యస్య రూపస్య నిత్యఁ దర్శనకాఙ్క్షిణః (11:52)
అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు.
ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.
067 మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః (12:02)
ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించు
చున్నారో, అట్టివారు అత్యంతమూ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
068 శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్-ధ్యానం విశిష్యతే
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్చ్హాఁతిరనంతరం (12:12)
అభ్యాసయోగముకన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మ
ఫలత్యాగమూ శ్రేష్ఠము. అట్టి త్యాగమువల్ల సంసార బంధనము తొలగి
మోక్షప్రాప్తి సంభవించుచున్నది.
069 అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః (12:16)
ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాత రహితుడై భయమును వీడి
కర్మ ఫల త్యాగియై నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.
070 సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః (12:18)
తుల్యనిందాస్తుతిర్మౌనీ సఁతుష్టో యేన కేనచిత్
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః (12:19)
శత్రుమిత్రులయందును, మానావ మానములయందును, శీతోష్ణ సుఖ
దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై,
చలించని మనస్సు కలవాడై, నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు
నాకు ప్రీతిపాత్రుడు.
071 ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః (13:02)
అర్జునా! దేహము క్షేత్రమనియూ, దేహమునెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియూ పెద్దలు
చెప్పుదురు.
072 అధ్యాత్మజ్ఞాననిత్యత్వఁ తత్త్వజ్ఞానార్థదర్శనం
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా (13:12)
ఆత్మ జ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మౌక్షప్రాప్తి యందు దృష్టి
కలిగియుండుట జ్ఞాన మార్గములనైయూ, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియూ చెప్పబడును.
073 కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే (13:21)
ప్రకృతిని "మాయ" యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండును.
074 సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం
వినశ్యత్స్వవినశ్యంతఁ యః పశ్యతి స పశ్యతి (13:28)
శరీరము నశించిననూ తాను సశింపక ఎవడు సమస్త భూతములందున్న
పరమేశ్వరుని చూచునో వాడే యెరిగినవాడు.
075 అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః
శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే (13:32)
అర్జునా! గుణ నాశన రహితుడైనవాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంత
ర్గతుడయ్యునూ కర్మల నాచరించువాడు కాడు.
076 యథా ప్రకాశయత్యేకః కృత్స్నఁ లోకమిమం రవిః
క్షేత్రఁ క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత (13:34)
పార్థా! సూర్యుడొక్కడే యెల్ల జగత్తులనూ ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగనే క్షేత్రజ్ఞుడు యెల్ల దేహములనూ ప్రకాశింపజేయుచున్నాడు.
ఇది ఉపనిషత్తుల సారాన్శమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. |
