ఘంటసాల స్వీయ చరిత్ర
(Ghantasala's autobiography)

RTS Transcribed by NaChaKi

Editors Note: This article is in Unicode; If you cannot see the Telugu script, please scroll down to read the RTS Transcription, or see the pdf version here

ఒక సామాన్య కుటుంబంలో 1922 డిసెంబరు 4వ తేదీని నా జీవిత కథ ప్రారంభం అయింది. మా తల్లిదండ్రులకు కలిగిన సంతానంలో నేను మధ్యముణ్ణి. మా తండ్రిగారు సూరయ్యగారు సంగీతజ్ఞులు. మృదంగం కూడా వాయించేవారు. ప్రధానంగా వారు తరంగ గానంలో ప్రత్యేక కృషి చేసినవారు. నేడు తరంగ గానంలో సుప్రసిద్ధులైనవారు చాలా మంది వారినుండి శిక్షణపొందినవారే.

అయితే మా తండ్రిగారు సంసార జీవితంలో అతి నిర్లిప్తంగా ఉండేవారు. ఇంట్లో ఉంటే జపం చేసుకొంటూ ఉండడం, బయటకుపోతే ఏ ఏకా హాలలోనో, భజన కాలక్షేపాలలోనో, తంమయులై గానం చేస్తూ ఉండడం, ఇంతే వారి జీవిత విధానం. సంసార బాధ్యతలను విస్మ రిస్తున్నారని బంధువులంతా విమర్శించేవారు ఆయన్ని.

మా తండ్రిగారి విషయంలో నా బాల్యస్మృతి ఒకటి ఎప్పుడూ మనస్సుకి తడుతూ వుంటుంది. మృదంగం వీపున కట్టుకొని, నన్ను భుజం మీద ఎక్కించుకొని, ఎంత దూరమైనా ఎక్కడ భగవత్సంకీర్తనం జరిగితే, అక్క్డికి హాజరయి, తాను మృదంగం వాయిస్తూ, పాడుతూ, నాచేత నృత్యం చేయిస్తూ ఉండేవారు. నాటి నా దివ్య స్వరూపం, నృత్యం అందరికి ముచ్చట కొలుపుతూ ఉండేవి. ఆ రోజుల్లో "బాలభరతుడు" అని అందరూ ముద్దుగా పిలిచేవారు. ఎన్నో బంగారు పతకాలు, బహుమతులు కూడా అప్పట్లో లభించాయి. ఆ బాల్యపు రోజులలోనే విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి దర్శనం చేసుకొన్న మధురస్మృతి ఉంది.

నా పదకొండవ యేట మా తండిగారు కాలధర్మం చెందేరు. చివరిరోజుల్లో ఆయన నన్ను దగ్గరికి తీసుకొని, సంగీత విద్యలో తరించ వలసినదిగా ఆదేశిస్తూ ఉండేవారు. మా తండ్రిగారి యావజ్జీవిత _తపఃఫలమే_ నా అభ్యుద యానికి కారణం అని నా నమ్మకం.

మా తండ్రిగారు పోయినతరువాత నా చదువు సంధ్యలు తిన్నగా జరగ లేదు. దృష్టి ఎప్పుడూ ఆట పాటలమీద ఉండేది. మా కుటుంబం అంతా మా మేనమాం ర్యాలి పిచ్చి రామయ్యగారి సం'రక్షణ క్రిందకు వచ్చింది.

చివరి రోజులలో తండ్రిగారు చెప్పిన మాటలు ఎప్పుడూ తలపుకి వస్తూ ఉండేవి. ఏమైనా సరే సంగీత విద్య సాధించాలి అని నాలో నేను శపథం చేసుకుంటూ ఉండేవాణ్ణి. చుట్టుప్రక్కలున్న చాలామంది సంగీత విద్వాం'సులను ఆశ్రయించాను శిక్షణకోసం. అయితే గురుకులవాస దీక్షకు నాటి నా బాల్య ప్రవృత్తి తట్టుకోలేకపోయింది. అంతటితో ఏ విధమైన విద్యా వ్యాసంగం లేక యేదో కాలక్షేపం ధోరణిలో పడింది జీవితం. ఈ పరిస్థితులలో ఒక సంగీత సమావేశంలో నేనూ, నా సంగీతం ఎంతో నవ్వులపాలవడం జరిగింది. నాటినుండి ఒకే వేదన ప్రారంభం అయింది. "సంగీత విద్య సాధించాలి. తండ్రిగారి ఆత్మకు శాంతి కలింగించాలి. నన్ను అపహాస్యం చేసినవారిని సంగీత విద్యలోనే ప్రతీకారం చేయాలి." ఇదే నిరంతర ధ్యాస.

నాటికి ఆంధ్రదేశంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరం'లో మాత్రమే ఉంది. మహామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు, శ్రీ ద్వారం వెంకట స్వామినాయుడుగారు మొదలైన సుప్రసిద్ధ విజయనగర సంగీత విద్వాం'సుల కీర్తి బాల్యము నుండి కూడా తెలియడం జరిగింది. సంగీత విద్య విజయ నగర సంగీతకళాశాలలోనే సాధన చేయాలి. గత్యంతరం లేదు. విజయనగరం వెళ్ళటానికి తగిన ప్రోత్సాహం యింట్లో లభించే ఆశ లేకపోయినది.

ఇంట్లో ఎవరికీ తెలియకుండా చేతినున్న బంగారు ఉంగరం విక్రయించి ఆసొమ్ము పట్టుకొని విజయనగరం చేరుకొన్నాను. సరిగా ఆ సమయానికి సంగీత కాలేజి వేసవి సెలవల మూలం'గా మూయబడి ఉంది. అంతేకాకుండా నేను విజయనగరంలో నిలదొక్కుకుని కాలేజీలో సక్రమం'గా ప్రవేశించడానికి కూడా ఎంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది.

ఇటువంటి నిరుత్సాహ పరిస్థితులలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి దర్శనం చేసేను. శ్రీ శాస్త్రిగారు సంగీతకళాశాలలో గాత్రపండితులుగా వున్నారు. శ్రీ శాస్త్రిగారిని ఆ ప్రాంతంలో అందరు వారు సాలూరు చినగురువుగారనే వారు (వారి తండ్రిఆరు పెద్దగురువుగారు). సాలూరు గ్రామంలో అంతకు పూర్వం చాలా కాలమునుంచి సంగీత పాఠశాల నెలకొల్పి ఎంతో మంది విద్యార్థులకు వుచితంగా సంగీత విద్య వుపదేశిస్తూ ఉండేవారు. శ్రీ శాస్త్రిగారు విజయనగర సంగీతకళాశాలలో ప్రవేశించి అప్పటికి కొద్దికాలమే అయింది.

శ్రీ శాస్త్రిగారు నాచేత పాడించి, నా గాత్రం విని ఎంతో ముగ్ధులయేరు. నన్నూ, నా పరిస్థితులని తెలుసుకొన్నారు. సంగీత విద్య యెడల నాకు గల తీవ్రమైన ఆకాంక్షను అర్థం చేసుకొన్నారు. నన్ను సర్వవిధాలా ప్రోత్స హించి నాలో ధైర్యం కలిగించేరు. శ్రీ శాస్త్రిగారి గానం, వారి మూర్తి మంతం, సౌంయత నన్ను ప్రబలం'గా ఆకర్షించేయి. "గురువు" అన్న మాట శ్రీ శాస్త్రిగారి యెడలనే సార్థకమయిందనిపించింది. నాటినుండే వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించేను.

విజయనగరంలోని ఇంగ్లీషు, సం'స్కృతం, సంగీత కళాశాలల విద్యార్థులకు కొన్ని వందల మందికి మహారాజావారి సత్రంలో భోజన వసతి కల్పించ బడింది. నేను సంగీత కళాశాలలో ప్రవేశించి, సత్రంలో భోజనపు యేర్పాటు అయే పర్యంతరం జీవితం గడపటం ఏ విధంగా అనే సమస్య యేర్పడింది.

ఆనాటికి యింకా సం'స్కృత విద్యార్థులు మధూకరం చేయడం, వారాలు చేసుకోవడం అనేది చాలా సహజం అనే భావింపబడుతూ ఉండేది.

మొట్ట మొదట మధూకరపు జోలె భుజాన వేసుకొని తిరిగిన ఆరోజు అనుభవం ఎన్నటికి మరపురాదు.

ఏమైనా నాడు యే తల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్య పూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించినది.

సెలవులు పూర్తి అయిన తరువాత నేను సంగీత కళాశాలలో ప్రవేశించడం జరిగింది నాటి సంగీతకళాశాల ప్రింసిపాలు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు నా సంగీత _జ్ఞానం_ పరీక్షించి, నా గాత్రం సుశరీరంగా నిర్ణ యించి నన్ను గాత్ర సంగీతమే సాధన చేయవలసిందని ప్రోత్సహించేరు. లేని పక్షంలో నేను వయొలిం విద్యార్థిగా చేరి ఉండేవాడినేమో. ఆరోజుల్లో ఆ వాతావరణంలో శ్రీ నాయుడిగారి శిష్యులని అనిపించుకోవడం గొప్పగా భావింపబడేది.

మా గురువులు సీతారామశాస్త్రిగారి సమక్షంలో ఆరు సంవత్సరములు దీక్షగా శాస్త్రీయ సంగీతం అభ్యసించి కళాశాల పరీక్ష నిచ్చి పూజ్యులు ద్వారం వెంకటస్వామినాయుడుగారి నుండి కళాశాల పట్టము పొందేను. విద్యార్థి దశలోనే గవర్నమెంటు సంగీత పరీక్షలలో హయ్యరుపరీక్షలో కూడా ఉత్తీర్ణుడనయ్యేను.

మా గురువుల ఉపదేశ మహాత్మ్యం వలన సంగీత విద్య లక్ష్య, లక్షణము లేకుండా కాకుండా నాదశుద్ధి, శృతిశుద్ధి ఏర్పడ్డాయి. గురువుగారు విద్యార్థుల లోని భావనాశక్తిని, నిర్మాణాత్మకమైన శక్తిని, స్వాతంత్ర్యాన్ని, రస దృష్టిని ప్రోత్సహించేవారు. వారి ప్రభావము వలననే భవిష్యత్తులో నా సంగీతానికి ఒక విశిష్టత, ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడ్డాయి.

నేను సంగీతకళాశాల విడిచిపెట్టిన నాటికి ప్రస్తుతం విజయవాడ సంగీత కళాశాల అధ్యక్షులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, వీణ విద్వాం'సులు శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు, హైదరాబాదు సంగీత కళాశాల ప్రింసిపాల్‌ శ్రీ నూకల చిన సత్యనారాయణ, శ్రీ జనగాం ఆంజనేయులు మొదలగు నేటి సుప్రసిద్ధ విద్వాం'సులు చాలామంది విద్యార్థి దశలోనే ఉండేవారు. సంగీత కళాశాల పట్టం పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో సుప్రసిద్ధ హరికథకులు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతారుగారు నాచేత ఒక సంగీత సభ ఏర్పాటు చేయించారు. నాటి సభాసరి ఆటపాటల మేటి శ్రీమదజ్ఞు డాదిభట్ల నారాయణ దాసుగారు నాకు ఒక తంబూరా బహూకరించారు. ఆరోజు నిజంగా నా జీవితంలో ఒక పర్వదినం.

నా విజయనగర జీవితంలో ఎన్నడూ మరువలేని వ్యక్తి శ్రీమతి సరిదె లక్ష్మీనరసమ్మ (కళావరు రింగు). విద్యార్థి దశలో ఆమె నా యెడల కనపర్చిన ఆదరాభిమానములు ఎన్నడూ మరువలేను.

సంగీత విద్యలో పట్టభద్రుడ నయిన తరువాత స్వగ్రామం చేరుకొని ఆంధ్రదేశంలో పలుతావుల్లో శ్రీరామనవమి, శారదానవరాత్రులు, గణపతి నవరాత్రులు మొదలగు ఉత్సవ కార్యక్రమాలలో, వివాహ మహోత్సవాలల్లోనూ సంగీత కచేరీలు అనేకం చేసాను.

ఆరోజుల్లోనే పూజులు వాగ్గేయకారులైన శ్రీ హరి నాగభూషణంగారు, శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు, శ్రీ క్రోని సత్యనారాయణగారు, శ్రీ వారణాసి బ్రహ్మయ్య శాస్త్రిగారు మొదలగు సుప్రసిద్ధ విద్వాం'సుల ఆశీర్వాదాలు పొందడం జరిగింది. తరువాత కొంతకాలానికి మద్రాసు చేరిన తరువాత కూడా ఆల్‌ ఇండియా రేడియోలో నేను చాలా కాలం శాస్త్రీయ సంగీత కార్యక్రమాలే యిచ్చేవాడిని.

అయితే కేవలం సంగీత కచేరీల పైననే ఆధారపడి జీవితం గడపడం దుర్భరమనిపించింది. ఆంధ్ర దేశంలో సంగీత కచేరీలకన్న నాటక ప్రదర్శనలూ హరికథలే ఆర్థికంగా లాభదాయకంగా కనపడింది. బాల్యంనుంచి నృత్యంలోను, నాటక కళలోనూ అభిరుచి ఉండటంచేత స్వయంగా ఒక నాటక సమాజాన్ని స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించేను. అప్పట్లో సుప్రసిద్ధ స్టేజి నటకులు శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి, శ్రీ పారుపల్లి సుబ్బారావు, శ్రీ పారుపల్లి సత్యనారాయణ, శ్రీ సూరిబాబు, శ్రీ రఘురామయ్య, శ్రీ పులిపాటి వేంకటేశ్వర్లు, శ్రీ పీసపాటి నరసింహమూర్తి మొదలగు పెద్దలతో పరిచయం అయి, తరువాత వీరిలో కొంతమందితో కలిసి నాటకాలలో నటించే అవకాశం కూడ కలిగింది. అప్పట్లో ఒకమారు ఆంధ్ర నాటక కళా పరిషత్తులో కూడా పాల్గొనడం జరిగింది. మరో పుష్కరం దాటేక ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారు నన్ను సంమానించడం జరిగింది.

సంగీత సభలు చేస్తూ, నాటకాలు ఆడుతూ సంగీత శిక్షణలు యిస్తూ ఆర్థికంగా సతమతమవుతున్న సమయంలోనే ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో మునిగింది. భారతదేశం పరప్రభుత్వానికి దాస్యం చేస్తూ ఉంది. మన నాయకులు అందరు జైళ్ళలో మ్రగ్గుతూ ఉన్నారు. జాతీయ కాంగ్రెసు Quit India తీర్మానం చేసింది. రాజకీయంగా దేశమంతటా ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. 1942 లో ఆగస్టులో దేశం నలుమూలలా కార్చిచ్చువలె విప్లవోద్యమం చెలరేగింది.

నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబ బాధ్యత నా సంగీత సాధన అన్నీ దేశ భవితవ్యం దృష్ట్యా చాలా అల్పంగా కనిపించేయి. నేను యేనాడూ యే రాజకీయ ఉద్యమాల్లోనూ అంతవరకూ పాల్గొన్నవాణ్ణికాదు. ఏ విధమైన రాజకీయ విధానాలు తెలిసిన వాణ్ణీ కాదు. అయితే ఒకటే అమాయకమైన ఆవేశం కలిగింది. దేశం యువకుల ధైర్యసాహసాలను, త్యాగాన్ని కోరుతూ ఉంది. ప్రతి యువకుడూ అర్థం, మానం, ప్రాణం ఆహుతి చేయవలసిన సమయం వచ్చింది. ఏమైనా కాని యింతకంటే భారత పౌరుడుగా వేరే కర్తవ్యం నాకు లేదు. ఈ ఆవేశంతోనే చాలమంది మిత్రులతో నాటి ఆగస్టు ఉద్యమంలో పాల్గొన్నాను. ఫలితంగా నాటి పరప్రభుత్వం పదునెనిమిది మాసాలు కారాగార శిక్ష విధించింది.

జైలు జీవితం నాకు ఎన్నో విధాలుగా మహోపకారం చేసింది. కర్తవ్య దీక్ష, స్థిర సంకల్పం, నియమబద్ధమైన జీవితం, నేను జైలు జీవితం గడిపి నప్పుడే అర్థం చేసుకున్నాను.

జైలులో ఉన్నప్పుడే శ్రీ గోపాలరెడ్డిగారు, శ్రీ పొట్టి శ్రీరాములుగారు, శ్రీ B.S. మూర్తిగారు, శ్రీ ఎర్నేని సుబ్రహ్మంయంగారు మొదలగు నాయకుల సాహచర్యం లభించింది.

జైలునుండి విడుదల పొందిన తరువాత నాలో ఏ విధమైన రాజకీయాల ప్రభావం మిగలలేదు. మళ్ళా నా సహజ మనఃస్థితిలో పడి, నా సంగీత సాధనలోనూ, నాటక ప్రదర్శనలోనూ రోజులు గడపడం ప్రారంభించేను.

ఈ రోజులలోనే నేను వివాహం చేసుకొనడం జరిగింది. నా శ్రీమతి సాహచర్యం నా ఆశల, ఆదర్శాల సాఫల్యానికి నాందీ వాక్యం పలికింది.

మా అత్తవారి గ్రామం పెదపులివఱ్ఱులో శ్రీమాం సముద్రాల రాఘవాచార్యులవారి పరిచయం కలిగింది. ఆ నాటికే శ్రీమాం రాఘవాచార్యులుగారు సినిమా పరిశ్రమలో ప్రముఖులుగా ఉంటున్నారు. వారి ఆదరణతోనూ, ప్రోత్సాహంతోనూ నేను సినిమా పరిశ్రమకు 1944 లో పరిచయం చేయబడ్డాను. అనతి కాలంలోనే సినిమా పరిశ్రమ నన్ను గుర్తించింది. సంగీత దర్శకునిగా, నేపథ్యగాయకునిగా, అశేష ఆంధ్రప్రజానీకం అనంయమైన ప్రేమానురాగాలు నా యెడల చూపించింది. నాటినుండి నేటివరకు కళాకారునిగా, నా కృషినీ, సాధననూ దేశం ప్రోత్సహిస్తూనే ఉంది. నన్ను చూడటానికి, నా సంగీతం వినడానికి ప్రజలు చూపిస్తున్న ఆసక్తికి, నా _కృతజ్ఞత_ తెలియపర్చుకొంటూ ఉంటాను.ఎప్పుడూ దక్షిణ భారత దేశంలో పల్లెలలోనూ, పట్టణాలలోనూ కూడా రసికుల ఎదుట కొన్నివేల కచేరీలు చేసి ఉన్నాను. అనేక ప్రజాసంస్థలు, కళా సంస్థలు నాయెడల సంమానాలు చేసేయి. అంతే కాకుండా ప్రముఖ రాజకీయనాయకుల సమక్షంలోనూ దేశమంత్రుల సన్నిధిలోనూకూడ నేను గానం చేసి వారి మన్ననల నందుకొనే అవకాశం కలిగింది. మద్రాసు మాజీ గవర్నరు శ్రీశ్రీ ప్రకాశ రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణ పండితుల సన్నిధిని గానం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

దగ్గరగా నూరు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించేను. 8 వేల పాటలు పైగా వివిధ భాషలలో సినిమా పాటలు పాడి రికార్డు చేయబడి ఉన్నాయి.

సినిమాలతో సంబంధం లేకుండా దేవతామూర్తులపైన, దేశభక్తికి సంబంధించి, వివిధ ఖండకావ్యములు నాచేత గానం చేయబడి రికార్డులు మూలంగా దేశం నలుమూలలా ఆనందించబడుతున్నాయి. సుప్రసిద్ధ మహాకవులు గురజాడ అప్పారావుగారి "పుత్తడి బొమ్మ పూర్ణమ్మ", శ్రీశ్రీగారి "పొలాలనన్నీ హలాలదున్నీ", "ఆనందం అర్ణవమైతే" అనే గేయాలకూ, శ్రీ కరుణశ్రీగారి పుష్ప విలాపం, కుంతీకుమారి మొదలగు ఖండకావ్యాలకు సంగీతం కూడా రికార్డు చేయగలిగే అదృష్టం నాకు కలిగింది.

అయితే సినీమా వ్యక్తిగా ధన సంపాదనచేస్తూ, అశేష ప్రజలను ఆకర్షిస్తూ, ఆనందింపజేస్తూ, వారి సంమానాలు అందుకోవడం మాత్రమే కళాకారుని జీవిత పరమార్థంగా భావించలేకపోతున్నాను. కళ ఎంత ఉన్నతమైనదైనా కావచ్చును. కళాకారుడు కళను తపస్సుగా భావించవచ్చును. కాని కళాకారుడు ప్రజాసమస్యలకు, జీవితానికి ప్రజల కష్టనిష్ఠురాలకు దూరం కాకూడదు. తన కళ ప్రజాశ్రేయస్సుకి వినియోగింపబడినప్పుడే కళాకారుని జీవితం ధంయం అవుతుందని నా విశ్వాసం.

ఆ కారణంచేతనే దేశమాత పిలుపు ఎప్పుడు ఏ రూపంగా వినవచ్చినా నా సేవలనర్పించడానికి సంసిద్ధుడుగానే ఉన్నాను.

జాతీయ యుద్ధనిధి సేకరణలోనూ, అనేక వైద్యశాలల నిర్మాణంలోనూ, కళాశాలల నిర్మాణంలోనూ, పోలీసు నిధి సేకరణలోనూ, అనేక సాంస్కృతిక కార్యకలాపాలలోనూ, కళాకారునిగా నా శక్తిని వినియోగించి ఆయా కార్యక్రమ నిర్వహణలో భాగస్వామిని కాగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మన జాతీయ నాయకులు నాలోని సేవాభావాన్ని గుర్తించి అనేక రాజకీయ సభలలో పాల్గొనే అవకాశం కల్పిస్తూనే ఉన్నారు. ఆంధ్ర దేశంలో జరిగిన సర్వోదయ మహాసభలో పాల్గొనడం నా భాగ్య విశేషమే.

శ్రీ కనూగాంధీ, శ్రీ వేముల కూర్మయ్య, శ్రీ B.S.మూర్తి, శ్రీ ఊటుకూరి సత్యనారాయణ మొదలగు హరిజన నాయకులతో హరిజన సమాజాలలో పాల్గొని హరిజన సమస్యను సానుభూతితో అర్థం చేసుకొనటానికి తగిన గేయాలు పాడి ఉపంయాసాలు చేసి నా కర్తవ్యాన్ని పాటిస్తున్నానని తృప్తిపడుతుంటాను. దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత మన భారత సంస్కృతినీ, కళలనూ విదేశీయులు అర్థం చేసుకునేందుకు తగిన అవకాశాలు చాలా కలిగేయి. ముఖ్యంగా మన సంగీతం మన వాద్యములు, మన భరత నాట్యం విదేశీయుల మన్ననల నందుకొన్నాయి.

అయితే భారతడేశపు వివిధ సంగీత రీతులను ఆకర్షణీయంగా విదేశాలలో ప్రదర్శించవలసిన అవసరం ఉంది. మనదేశంలో శాస్త్రీయ సంగీతం ఎంత అభివృద్ధి చెందిందో "దేశి" సంగీతంకూడా అంత అభివృద్ధిని పొందింది. "దేశి" సంగీతం సాహిత్యప్రాధాంయం కలిగి ప్రజా జీవితాన్ని ప్రతిఫలిస్తూ "గతి" ప్రధానంగా ఉంటుంది. ఇంతవరకూ విదేశీయులు మన శాస్త్రీయ సంగీతం మాత్రమే విని ఆనందించడానికి తగిన అవకాశములు కల్పించబడుతున్నాయి.

మన వీధి భాగవతులు, బొమ్మలాటలు, బుఱ్ఱకథలు వీటికి కూర్పబడిన సంగీతం, మన నాటకాలలోని పద్యపఠన విధానం, గ్రామీణ జీవితాన్ని ప్రతిఫలిస్తున్న ప్రాక్తన పదాలు, ఊడుపుల పాటలు, నూర్పుల పాటలు, చెక్క భజనలు, పడవ పాటలు, దంపుళ్ళ పాటలు, లాలి పాటలు, జోల పాటలు మొదలైన "దేశి" సంగీత రీతులు విదేశీయులను అమితంగా ఆకర్షిస్తాయని నా నమ్మకం. అయితే వాటిని కళాత్మకంగా ప్రదర్శించడానికి ఆయా సంగీతకారుల యెడల కళాకారునికి ఎంతో సానుభూతి అవసరమయి ఉంటుంది. అదృష్టవశాత్తు నాకు ఆయా సంగీత రీతులన్నిటితోనూ ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అతి బాల్యంనుండి "దేశి" సంగీత ప్రభావంకూడా నాపైన ఎంతో ఉంది. ముఖ్యంగా ఆంధ్రదేశానికి చెందిన వివిధ సంగీతరీతులను విదేశాలలో ఆకర్షణీయంగా ప్రదర్శించగలనని నమ్మకం నాకు ఉంది.

నా ఆశలలో మరొక ప్రధానమైనది లలిత సంగీత ప్రచారానికి తగిన పాఠశాల నిర్మింపబడాలనేది.

ఈనాడు మన ప్రభుత్వం మన కళలను అభివృద్దిపరచడానికి ఎన్నో కార్యక్రమాలను అమలుపరుస్తున్నది. చాలా చోట్ల సంగీత కళాశాళలు, గురుకులములు, నాట్యపాఠశాలలు నిర్వహిస్తున్నది. సంగీత విద్వాంసులను, నాట్య శాస్త్రవేత్తలను సత్కరిస్తూనే ఉంది.

దేశంలో శాస్త్రీయ సంగీతంలో నిజమైన _రసజ్ఞత_ పెంపొందించుకోవాలంటే అందుబాటుగా ఉండే లలిత సంగీత ప్రచారంవలనే జరుగుతుందని నా విశ్వాశం. దేశం లలిత సంగీతంయొక్క ఆవశ్యకతను గుర్తించింది. ఆకాశావాణి లలిత సంగీత కార్యరమాలను యేర్పాటు చేస్తూనే ఉంది. అయితే లలిత సంగీతం అన్నది ఏ రెండు మూడు ఆధునిక కవుల విషాద గేయాలో పాడడంతో సార్థకమవదు.

లలిత సంగీత ప్రచారానికి కళాశాలలు స్థాపించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఈపని చేయగలదు.

ఈ కార్యక్రమంలో నేను ప్రభుత్వానికి ఉపయోగ పడగలననే నా విశ్వాసం. ప్రేమమూర్తులు, పూజనీయులు, మా తల్లితండ్రుల, గురువుల ఆశీర్వాద ప్రభావంతో నా కర్తవ్యాన్ని భవిష్యత్తులో సార్థకంగా నిర్వహించగలననే ఆశిస్తున్నాను.


oka sAmAMya kuTuMbaMlO 1922 DiseMbaru 4va tEdiini nA jiivita katha prAraMbhaM ayiMdi. mA tallidaMDrulaku kaligina saMtAnaMlO nEnu madhyamuNNi. mA taMDrigAru sUrayyagAru saMgiitaj~nulu. mRdaMgaM kUDA vAyiMcEvAru. pradhAnaMgA vAru taraMga gAnaMlO pratyEka kRshi cEsinavAru. nEDu taraMga gAnaMlO suprasiddhulainavAru cAlA maMdi vArinuMDi SikshaNapoMdinavArE.

ayitE mA taMDrigAru saMsAra jiivitaMlO ati nirliptaMgA uMDEvAru. iMTlO uMTE japaM cEsukoMTU uMDaDaM, bayaTakupOtE E EkA hAlalOnO, bhajana kAlakshEpAlalOnO, taMmayulai gAnaM cEstU uMDaDaM, iMtE vAri jiivita vidhAnaM. saMsAra bAdhyatalanu visma ristunnArani baMdhuvulaMtA vimarSiMcEvAru aayanni.

mA taMDrigAri vishayaMlO nA bAlyasmRti okaTi eppuDU manassuki taDutU vuMTuMdi. mRdaMgaM viipuna kaTTukoni, nannu bhujaM miida ekkiMcukoni, eMta dUramainA ekkaDa bhagavatsaMkiirtanaM jarigitE, akkDiki hAjarayi, tAnu mRdaMgaM vAyistU, pADutU, nAcEta nRtyaM cEyistU uMDEvAru. nATi nA divya svarUpaM, nRtyaM aMdariki muccaTa koluputU uMDEvi. aa rOjullO "bAlabharatuDu" ani aMdarU muddugA pilicEvAru. ennO baMgAru patakAlu, bahumatulu kUDA appaTlO labhiMcAyi. aa bAlyapu rOjulalOnE viSvadAta kASiinAdhuni nAgESvararAvu paMtulugAri darSanaM cEsukonna madhurasmRti uMdi.

nA padakoMDava yETa mA taMDigAru kAladharmaM ceMdEru. civarirOjullO aayana nannu daggariki tiisukoni, saMgiita vidyalO tariMca valasinadigA aadESistU uMDEvAru. mA taMDrigAri yAvajjiivita _tapa@hphalamE_ nA abhyuda yAniki kAraNaM ani nA nammakaM.

mA taMDrigAru pOyinataruvAta nA caduvu saMdhyalu tinnagA jaraga lEdu. dRshTi eppuDU aaTa pATalamiida uMDEdi. mA kuTuMbaM aMtA mA mEnamAM ryAli picci rAmayyagAri saM'rakshaNa kriMdaku vacciMdi.

civari rOjulalO taMDrigAru ceppina mATalu eppuDU talapuki vastU uMDEvi. EmainA sarE saMgiita vidya sAdhiMcAli ani nAlO nEnu SapathaM cEsukuMTU uMDEvANNi. cuTTuprakkalunna cAlAmaMdi saMgiita vidvAM'sulanu aaSrayiMcAnu SikshaNakOsaM. ayitE gurukulavAsa diikshaku nATi nA bAlya pravRtti taTTukOlEkapOyiMdi. aMtaTitO E vidhamaina vidyA vyAsaMgaM lEka yEdO kAlakshEpaM dhOraNilO paDiMdi jiivitaM. ii paristhitulalO oka saMgiita samAvESaMlO nEnU, nA saMgiitaM eMtO navvulapAlavaDaM jarigiMdi. nATinuMDi okE vEdana prAraMbhaM ayiMdi. "saMgeeta vidya sAdhiMcAli. taMDrigAri aatmaku SAMti kaliMgiMcAli. nannu apahAsyaM cEsinavArini saMgiita vidyalOnE pratiikAraM cEyAli." idE niraMtara dhyAsa.

nATiki aaMdhradESaMlO Ekaika saMgiita kaLASAla vijayanagaraM'lO mAtramE uMdi. mahAmahulu Sree aadibhaTla nArAyaNadAsugAru, Sree dwAraM veMkaTa swAminAyuDugAru modalaina suprasiddha vijayanagara saMgiita vidwAM'sula kiirti bAlyamu nuMDi kUDA teliyaDaM jarigiMdi. saMgiita vidya vijaya nagara saMgiitakaLASAlalOnE sAdhana cEyAli. gatyaMtaraM lEdu. vijayanagaraM veLLaTAniki tagina prOtsAhaM yiMTlO labhiMcE aaSa lEkapOyinadi.

iMTlO evarikii teliyakuMDA cEtinunna baMgAru uMgaraM vikrayiMci aasommu paTTukoni vijayanagaraM cErukonnAnu. sarigA aa samayAniki saMgiita kAlEji vEsavi selavala mUlaM'gA mUyabaDi uMdi. aMtEkAkuMDA nEnu vijayanagaraMlO niladokkukuni kAlEjiilO sakramaM'gA pravESiMcaDAniki kUDA eMtO pratikUla vAtAvaraNaM ErpaDiMdi.

iTuvaMTi nirutsAha paristhitulalO Sree paTrAyani siitArAmaSAstrigAri darSanaM cEsEnu. Sree SAstrigAru saMgiitakaLASAlalO gAtrapaMDitulugA vunnAru. Sree SAstrigArini aa prAMtaMlO aMdaru vAru sAlUru cinaguruvugAranE vAru (vAri taMDriAru peddaguruvugAru). sAlUru grAmaMlO aMtaku pUrvaM cAlA kAlamunuMci saMgiita pAThaSAla nelakolpi eMtO maMdi vidyArthulaku vucitaMgA saMgiita vidya vupadESistU uMDEvAru. Sree SAstrigAru vijayanagara saMgiitakaLASAlalO pravESiMci appaTiki koddikAlamE ayiMdi.

Sree SAstrigAru nAcEta pADiMci, nA gAtraM vini eMtO mugdhulayEru. nannU, nA paristhitulani telusukonnAru. saMgiita vidya yeDala nAku gala tiivramaina aakAMkshanu arthaM cEsukonnAru. nannu sarvavidhAlA prOtsa hiMci nAlO dhairyaM kaligiMcEru. Sree SAstrigAri gAnaM, vAri mUrti maMtaM, souMyata nannu prabalaM'gA aakarshiMcEyi. "guruvu" anna mATa Sree SAstrigAri yeDalanE sArthakamayiMdanipiMciMdi. nATinuMDE vAri sannidhilO saMgiita sAdhana prAraMbhiMcEnu.

vijayanagaraMlOni iMgliishu, saM'skRtaM, saMgiita kaLASAlala vidyArthulaku konni vaMdala maMdiki mahArAjAvAri satraMlO bhOjana vasati kalpiMca baDiMdi. nEnu saMgiita kaLASAlalO pravESiMci, satraMlO bhOjanapu yErpATu ayE paryaMtaraM jiivitaM gaDapaTaM E vidhaMgA anE samasya yErpaDiMdi.

aanATiki yiMkA saM'skRta vidyArthulu madhUkaraM cEyaDaM, vArAlu cEsukOvaDaM anEdi cAlA sahajaM anE bhAviMpabaDutU uMDEdi.

moTTa modaTa madhUkarapu jOle bhujAna vEsukoni tirigina aarOju anubhavaM ennaTiki marapurAdu.

EmainA nADu yE talli modaTi kabaLaM nA jOlelO vEsiMdO aame aa vAtsalya pUritamaina bhiksha nAku ashTaiSwaryAlatO kUDina bhavishyattunE prasAdiMcinadi.

selavulu pUrti ayina taruvAta nEnu saMgiita kaLASAlalO pravESiMcaDaM jarigiMdi nATi saMgiitakaLASAla priMsipAlu Sree dwAraM veMkaTaswAmi nAyuDugAru nA saMgiita _j~nAnaM_ pariikshiMci, nA gAtraM suSariiraMgA nirNa yiMci nannu gAtra saMgiitamE sAdhana cEyavalasiMdani prOtsahiMcEru. lEni pakshaMlO nEnu vayoliM vidyArthigA cEri uMDEvADinEmO. aarOjullO aa vAtAvaraNaMlO Sree nAyuDigAri Sishyulani anipiMcukOvaDaM goppagA bhAviMpabaDEdi.

mA guruvulu siitArAmaSAstrigAri samakshaMlO aaru saMvatsaramulu diikshagA SAstriiya saMgiitaM abhyasiMci kaLASAla pariiksha nicci pUjyulu dwAraM veMkaTaswAminAyuDugAri nuMDi kaLASAla paTTamu poMdEnu. vidyArthi daSalOnE gavarnameMTu saMgiita pariikshalalO hayyarupariikshalO kUDA uttiirNuDanayyEnu.

mA guruvula upadESa mahAtmyaM valana saMgiita vidya lakshya, lakshaNamu lEkuMDA kAkuMDA nAdaSuddhi, SRtiSuddhi ErpaDDAyi. guruvugAru vidyArthula lOni bhAvanASaktini, nirmANAtmakamaina Saktini, swAtaMtryAnni, rasa dRshTini prOtsahiMcEvAru. vAri prabhAvamu valananE bhavishyattulO nA saMgiitAniki oka viSishTata, pratyEka vyaktitwaM ErpaDDAyi.

nEnu saMgiitakaLASAla viDicipeTTina nATiki prastutaM vijayawADa saMgiita kaLASAla adhyakshulu Sree nEdunUri kRshNamUrti, viiNa vidwAM'sulu Sree ayyagAri sOmESwararAvu, haidarAbAdu saMgiita kaLASAla priMsipAl Sree nUkala cina satyanArAyaNa, Sree janagAM aaMjanEyulu modalagu nETi suprasiddha vidwAM'sulu cAlAmaMdi vidyArthi daSalOnE uMDEvAru. saMgiita kaLASAla paTTaM poMdi vijayanagaraM viDicipeTTE taruNaMlO suprasiddha harikathakulu Sree coppalli sUryanArAyaNa bhAgavatArugAru nAcEta oka saMgiita sabha ErpATu cEyiMcAru. nATi sabhAsari aaTapATala mETi Sriimadaj~nu DAdibhaTla nArAyaNa dAsugAru nAku oka taMbUrA bahUkariMcAru. aarOju nijaMgA nA jiivitaMlO oka parvadinaM.

nA vijayanagara jiivitaMlO ennaDU maruvalEni vyakti Sreemati saride laxmiinarasamma (kaLAvaru riMgu). vidyArthi daSalO aame nA yeDala kanaparcina aadarAbhimAnamulu ennaDU maruvalEnu.

saMgiita vidyalO paTTabhadruDa nayina taruvAta swagrAmaM cErukoni aaMdhradESaMlO palutAvullO SriirAmanavami, SAradAnavarAtrulu, gaNapati navarAtrulu modalagu utsava kAryakramAlalO, vivAha mahOtsavAlallOnU saMgiita kacEriilu anEkaM cEsAnu.

aarOjullOnE pUjulu vAggEyakArulaina Srii hari nAgabhUshaNaMgAru, Sree pArupalli rAmakRshNayya paMtulugAru, Sree krOni satyanArAyaNagAru, Sree vAraNAsi brahmayya SAstrigAru modalagu suprasiddha vidwAM'sula aaSiirvAdAlu poMdaDaM jarigiMdi. taruvAta koMtakAlAniki madrAsu cErina taruvAta kUDA aal iMDiyA rEDiyOlO nEnu cAlA kAlaM SAstriiya saMgiita kAryakramAlE yiccEvADini.

ayitE kEvalaM saMgiita kacEriila painanE aadhArapaDi jiivitaM gaDapaDaM durbharamanipiMciMdi. aaMdhra dESaMlO saMgiita kacEriilakanna nATaka pradarSanalU harikathalE aarthikaMgA lAbhadAyakaMgA kanapaDiMdi. bAlyaMnuMci nRtyaMlOnu, nATaka kaLalOnU abhiruci uMDaTaMcEta swayaMgA oka nATaka samAjAnni sthApiMci nATaka pradarSanalu ivvaTaM prAraMbhiMcEnu. appaTlO suprasiddha sTEji naTakulu Sree addaMki SreerAmamUrti, Sree pArupalli subbArAvu, Sree pArupalli satyanArAyaNa, Sree sUribAbu, Sree raghurAmayya, Sree pulipATi vEMkaTESwarlu, Sree piisapATi narasiMhamUrti modalagu peddalatO paricayaM ayi, taruvAta viirilO koMtamaMditO kalisi nATakAlalO naTiMcE avakASaM kUDa kaligiMdi. appaTlO okamAru aaMdhra nATaka kaLA parishattulO kUDA pAlgonaDaM jarigiMdi. marO pushkaraM dATEka aaMdhra nATaka kaLA parishattu vAru nannu saMmAniMcaDaM jarigiMdi.

saMgeeta sabhalu cEstU, nATakAlu aaDutU saMgeeta SixaNalu yistU aarthikaMgA satamatamavutunna samayaMlOnE prapaMcaM aMtA yuddha vAtAvaraNaMlO munigiMdi. bhAratadESaM paraprabhutwAniki dAsyaM cEstU uMdi. mana nAyakulu aMdaru jaiLLalO mraggutU unnAru. jAtIya kAMgresu #Quit India# tiirmAnaM cEsiMdi. rAjakiiyaMgA dESamaMtaTA udwigna paristhiti ErpaDiMdi. 1942 lO aagasTulO dESaM nalumUlalA kArciccuvale viplavOdyamaM celarEgiMdi.

nA vyaktigata jiivitaM, nA kuTuMba bAdhyata nA saMgiita sAdhana annii dESa bhavitavyaM dRshTyA cAlA alpaMgA kanipiMcEyi. nEnu yEnADU yE rAjakiiya udyamAllOnU aMtavarakU pAlgonnavANNikAdu. E vidhamaina rAjakiiya vidhAnAlu telisina vANNI kAdu. ayitE okaTE amAyakamaina aavESaM kaligiMdi. dESaM yuvakula dhairyasAhasAlanu, tyAgAnni kOrutuu uMdi. prati yuvakuDuu arthaM, mAnaM, prANaM aahuti cEyavalasina samayaM vacciMdi. EmainA kAni yiMtakaMTE bhArata pauruDugA vErE kartavyaM nAku lEdu. ii aavESaMtOnE cAlamaMdi mitrulatO nATi aagasTu udyamaMlO pAlgonnAnu. phalitaMgA nATi paraprabhutwaM padunenimidi mAsAlu kArAgAra Sixa vidhiMciMdi.

jailu jiivitaM nAku ennO vidhAlugA mahOpakAraM cEsiMdi. kartavya diixa, sthira saMkalpaM, niyamabaddhamaina jiivitaM, nEnu jailu jiivitaM gaDipi nappuDE arthaM cEsukunnAnu.

jailulO unnappuDE Sree gOpAlareDDigAru, Sree poTTi SreerAmulugAru, Sree #B.S.# mUrtigAru, Sree ernEni subrahmaMyaMgAru modalagu nAyakula sAhacaryaM labhiMciMdi.

jailunuMDi viDudala poMdina taruvAta nAlO E vidhamaina rAjakiiyAla prabhAvaM migalalEdu. maLLA nA sahaja mana@hsthitilO paDi, nA saMgeeta sAdhanalOnU, nATaka pradarSanalOnU rOjulu gaDapaDaM prAraMbhiMcEnu.

ii rOjulalOnE nEnu vivAhaM cEsukonaDaM jarigiMdi. nA Sreemati sAhacaryaM nA aaSala, aadarSAla sAphalyAniki nAMdii vAkyaM palikiMdi.

mA attavAri grAmaM pedapulivar''r''ulO SreemAM samudrAla rAghavAcAryulavAri paricayaM kaligiMdi. aa nATikE SreemAM rAghavAcAryulugAru sinimA pariSramalO pramukhulugA uMTunnAru. vAri aadaraNatOnU, prOtsAhaMtOnU nEnu sinimA pariSramaku 1944 lO paricayaM cEyabaDDAnu. anati kAlaMlOnE sinimA pariSrama nannu gurtiMciMdi. saMgeeta darSakunigA, nEpathyagAyakunigA, aSEsha aaMdhraprajAniikaM anaMyamaina prEmAnurAgAlu nA yeDala cUpiMciMdi. nATinuMDi nETivaraku kaLAkArunigA, nA kRshinii, sAdhananU dESaM prOtsahistUnE uMdi. nannu cUDaTAniki, nA saMgeetaM vinaDAniki prajalu cUpistunna aasaktiki, nA _kRtaj~nata_ teliyaparcukoMTU uMTAnu.eppuDU daxiNa bhArata dESaMlO pallelalOnU, paTTaNAlalOnU kUDA rasikula eduTa konnivEla kacEriilu cEsi unnAnu. anEka prajAsaMsthalu, kaLA saMsthalu nAyeDala saMmAnAlu cEsEyi. aMtE kAkuMDA pramukha rAjakiiyanAyakula samaxaMlOnU dESamaMtrula sannidhilOnUkUDa nEnu gAnaM cEsi vAri mannanala naMdukonE avakASaM kaligiMdi. madrAsu mAjii gavarnaru SreeSree prakASa rAshTrapati Sree rAdhAkRshNa paMDitula sannidhini gAnaM cEyagalagaDaM nA adRshTaMgA bhAvistunnAnu.

daggaragA nUru citrAlaku saMgeeta darSakatwaM vahiMcEnu. 8 vEla pATalu paigA vividha bhAshalalO sinimA pATalu pADi rikArDu cEyabaDi unnAyi.

sinimAlatO saMbaMdhaM lEkuMDA dEvatAmUrtulapaina, dESabhaktiki saMbaMdhiMci, vividha khaMDakAvyamulu nAcEta gAnaM cEyabaDi rikArDulu mUlaMgA dESaM nalumUlalA aanaMdiMcabaDutunnAyi. suprasiddha mahAkavulu gurajADa appArAvugAri "puttaDi bomma poorNamma", SreeSreegAri "polAlanannii halAladunnii", "aanaMdaM arNavamaitE" anE gEyAlakuu, Sree karuNaSreegAri pushpa vilApaM, kuMtiikumAri modalagu khaMDakAvyAlaku saMgeetaM kUDA rikArDu cEyagaligE adRshTaM nAku kaligiMdi.

ayitE siniimA vyaktigA dhana saMpAdanacEstU, aSEsha prajalanu aakarshistU, aanaMdiMpajEstU, vAri saMmAnAlu aMdukOvaDaM mAtramE kaLAkAruni jiivita paramArthaMgA bhAviMcalEkapOtunnAnu. kaLa eMta unnatamainadainA kAvaccunu. kaLAkAruDu kaLanu tapassugA bhAviMcavaccunu. kAni kaLAkAruDu prajAsamasyalaku, jeevitAniki prajala kashTanishThurAlaku dUraM kAkuuDadu. tana kaLa prajASrEyassuki viniyOgiMpabaDinappuDE kaLAkAruni jiivitaM dhaMyaM avutuMdani nA viSwAsaM.

aa kAraNaMcEtanE dESamAta pilupu eppuDu E rUpaMgA vinavaccinA nA sEvalanarpiMcaDAniki saMsiddhuDugAnE unnAnu.

jAtiiya yuddhanidhi sEkaraNalOnuu, anEka vaidyaSAlala nirmANaMlOnU, kaLASAlala nirmANaMlOnU, pOliisu nidhi sEkaraNalOnuu, anEka sAMskRtika kAryakalApAlalOnU, kaLAkArunigA nA Saktini viniyOgiMci aayA kAryakrama nirvahaNalO bhAgaswAmini kAgalagaDaM nA adRshTaMgA bhAvistunnAnu.

mana jAtiiya nAyakulu nAlOni sEvAbhAvAnni gurtiMci anEka rAjakiiya sabhalalO pAlgonE avakASaM kalpistuunE unnAru. aaMdhra dESaMlO jarigina sarvOdaya mahAsabhalO pAlgonaDaM nA bhAgya viSEshamE.

Sree kanUgAMdhii, Sree vEmula kUrmayya, Sree #B.S.#mUrti, Sree uuTukUri satyanArAyaNa modalagu harijana nAyakulatO harijana samAjAlalO pAlgoni harijana samasyanu sAnubhUtitO arthaM cEsukonaTAniki tagina gEyAlu pADi upaMyAsAlu cEsi nA kartavyAnni pATistunnAnani tRptipaDutuMTAnu. dESaM swAtaMtryaM poMdina taruvAta mana bhArata saMskRtinii, kaLalanuu vidESiiyulu arthaM cEsukunEMduku tagina avakASAlu cAlA kaligEyi. mukhyaMgA mana saMgeetaM mana vAdyamulu, mana bharata nATyaM vidESIyula mannanala naMdukonnAyi.

ayitE bhArataDESapu vividha saMgeeta riitulanu aakarshaNiiyaMgA vidESAlalO pradarSiMcavalasina avasaraM uMdi. manadESaMlO SAstriiya saMgeetaM eMta abhivRddhi ceMdiMdO "dESi" saMgeetaMkUDA aMta abhivRddhini poMdiMdi. "dESi" saMgeetaM sAhityaprAdhAMyaM kaligi prajA jiivitAnni pratiphalistU "gati" pradhAnaMgA uMTuMdi. iMtavarakuu vidESIyulu mana SAstriiya saMgeetaM mAtramE vini aanaMdiMcaDAniki tagina avakASamulu kalpiMcabaDutunnAyi.

mana veedhi bhAgavatulu, bommalATalu, bur''r''akathalu viiTiki kUrpabaDina saMgeetaM, mana nATakAlalOni padyapaThana vidhAnaM, graamINa jiivitAnni pratiphalistunna prAktana padAlu, uuDupula pATalu, nUrpula pATalu, cekka bhajanalu, paDava pATalu, daMpuLLa pATalu, lAli pATalu, jOla pATalu modalaina "dESi" saMgeeta riitulu vidESIyulanu amitaMgA aakarshistAyani nA nammakaM. ayitE vATini kaLAtmakaMgA pradarSiMcaDAniki aayA saMgeetakArula yeDala kaLAkAruniki eMtO sAnubhUti avasaramayi uMTuMdi. adRshTavaSAttu nAku aayA saMgeeta riitulanniTitOnU eMtO sannihita saMbaMdhaM uMdi. ati bAlyaMnuMDi "dESi" saMgeeta prabhAvaMkUDA nApaina eMtO uMdi. mukhyaMgA aaMdhradESAniki ceMdina vividha saMgeetariitulanu vidESAlalO aakarshaNiiyaMgA pradarSiMcagalanani nammakaM nAku uMdi.

nA aaSalalO maroka pradhAnamainadi lalita saMgeeta pracArAniki tagina pAThaSAla nirmiMpabaDAlanEdi.

iinADu mana prabhutvaM mana kaLalanu abhivRddiparacaDAniki ennO kAryakramAlanu amaluparustunnadi. cAlaa cOTla saMgeeta kaLASALalu, gurukulamulu, nATyapAThaSAlalu nirvahistunnadi. saMgeeta vidwAMsulanu, nATya SAstravEttalanu satkaristUnE uMdi.

dESaMlO SAstrIya saMgeetaMlO nijamaina _rasaj~nata_ peMpoMdiMcukOvAlaMTE aMdubATugA uMDE lalita saMgeeta pracAraMvalanE jarugutuMdani nA viSwASaM. dESaM lalita saMgeetaMyokka aavaSyakatanu gurtiMciMdi. aakASAvANi lalita saMgeeta kAryaramAlanu yErpATu cEstUnE uMdi. ayitE lalita saMgeetaM annadi E reMDu mUDu aadhunika kavula vishAda gEyAlO pADaDaMtO sArthakamavadu.

lalita saMgeeta pracArAniki kaLASAlalu sthApiMchavalasina avasaraM uMdi. prabhutwamE iipani cEyagaladu.

ii kAryakramaMlO nEnu prabhutwAniki upayOga paDagalananE nA viSwAsaM. prEmamUrtulu, pUjaniiyulu, mA tallitaMDrula, guruvula aaSiirvAda prabhAvaMtO nA kartavyAnni bhavishyattulO sArthakaMgA nirvahiMcagalananE aaSistunnAnu.