Mana Ghantasala Song Lyrics

naluguru kalisii poruvulu maricii

Movie:tODikODaLLuLyrics:kosaraaju
Music: Master VenuSingers:Ghantasala and chorus
Submitted by: Krishna Kandadai

నలుగురు కలిసీ పొరుపులు మరిచీ 

చెయ్యాలి ఉమ్మది వ్యవసాయం

నలుగురు కలిసీ పొరుపులు మరిచీ

చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం 

నలుగురు కలిసి పొరుపులు మరిచి

చేస్తే ఉమ్మడి వ్యవసాయం- మన

కిస్తుం దెక్కువ ఫలసాయం - ఇది

రైతులకెంతో సదుపాయం  



ఒక సంసారం వందెకరాలను

పండించటమే అరుదుకదా - అది

భరించలేని బరువుకదా

పది కుటుంబములు వెయ్యెకరాలను

సాగుచెయ్యడం సులువుకదా    (నలుగురు)



మహారాజులూ జమీందారులూ

మచ్చుకు దొరకని కాలంలో - ఈ

ప్రజలే ఏలే రాజ్యంలో

ఇతరుల కశ్టం దోచుకు తినడం

ఇకపై సాగే పని కాదు !   (నలుగురు)



ఇదియే సూత్రం ఒక్కడు మాత్రం

భూమిని గుత్తకు కొనరాదు - కడు

సోమరిపోతై మనరాదు

నేలా నీరూ గలీ వెలుగూ

కొందరి సొత్తని అనరాదు - అవి

అందరి హక్కై అలరారు      (నలుగురు)



ఒక్కొక్క వ్యక్తీ, సమస్త శక్తీ

ధారపోసి పనిచెయ్యాలి - ధన

ధాన్యరాశులే పెంచాలి

కూటికి గుడ్డకు లోటులేక తన

కవసరమైనవి పొందాలి    (నలుగురు)




naluguru kalisii porupulu maricii 
ceyyAli ummadi vyavasAyaM
naluguru kalisii porupulu maricii
ceyyAli ummaDi vyavasAyaM 
naluguru kalisi porupulu marichi
chEstE ummaDi vyavasAyaM- mana
kistuM dekkuva phalasAyaM - idi
raitulakeMtO sadupAyaM  

oka saMsAraM vaMdekarAlanu
paMDiMcaTamE arudukadA - adi
bhariMcalEni baruvukadA
padi kuTuMbamulu veyyekarAlanu
sAguceyyaDaM suluvukadA    (naluguru)

mahArAjulU jamiiMdArulU
maccuku dorakani kAlaMlO - ii
prajalE ElE rAjyaMlO
itarula kashTaM dOcuku tinaDaM
ikapai sAgE pani kAdu !   (naluguru)

idiyE sUtraM okkaDu mAtraM
bhUmini guttaku konarAdu - kaDu
sOmaripOtai manarAdu
nElA niirU galii velugU
koMdari sottani anarAdu - avi
aMdari hakkai alarAru      (naluguru)

okkokka vyaktii, samasta Saktii
dhArapOsi paniceyyAli - dhana
dhAnyarASulE peMcAli
kUTiki guDDaku lOTulEka tana
kavasaramainavi poMdAli    (naluguru)


EDIT