Mana Ghantasala Song Lyrics

lavakuSa padyaalu

Movie:lavakuSaLyrics:dhyAnaM
Music:ghaMTasaalaSingers:ghaMTasaala
Submitted by: Krishna Kandadai

శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గ స్థితి లయేశ్వరీం
            నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీం

నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాంవయో
        ధ్బవ రాజన్యులు మున్ను దాల్చి గరిమం పాలించి రీ భూమి సం     
        స్థవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీ యెడం
        భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా !

సప్తాశ్వరధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
            శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


రావణు సంహరించి, రఘురాముడు దుర్భర కీలి కీలలం
         పావనియైన సీత, నసమాన పతివ్రత లోకమాత సం
         భావనజేసి గైకొని, సుపర్వులు మెచ్చగ, లక్ష్మణుండు, సు
         గ్రీవుడు, వాయునందనుడు, ప్రీతిని గొల్వ అయోధ్య జేరినం !!

ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సు
         త్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరొ, అట్టి తల్లి సీ
         తా మహిళా శిరోమణిని, దారుణ కానన వీధి కంపగా
         నీ మది యెట్టు లొప్పె? నెట నేర్చితి వీ కఠినత్వ మగ్రజా 

==

     ఉ   ఇంతకు బూనివచ్చి వచియింపక పోదునె, విన్ము తల్లి, దు
         శ్చింతులు, దైత్యుచేబడిన సీతను గ్రమ్మర్'అ నేలుచున్నవా
         డెంత విమోహి రాముడని, యెగ్గులు పల్కిన నాలకించి, భూ
         కాంతుడు నిందజెంది నిను గానల లోపల దించి రమ్మనెం

     చ   ప్రతిదిన మేను తొల్దులుత పాదములంటి నమస్కరించి, నీ
          యతులితమైన దీవనల నంది చరింతు, తదీయ భాగ్య మీ
          గతి యెడ మాయె, నింకెపుడు గాంతు భవత్పదపద్మముల్ నమ
          శ్శతములు సేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీ.

     చ   ఇదె మన యాశ్రమం బిచట నీవు వసింపుము, లోకపావనీ
          సదమలవృత్తి నీకు పరిచర్యలు సేయుదు రీ తపస్వినుల్
          ముదముగ రామనామను తపోవనమెల్ల ప్రతిధ్వనించు
          నీ పదములు సోకి మా యునికి పావనమై చెలువొందు నమ్మరో.


    సీ     రంగారు బంగారు చెంగావులు ధరించు 
                    శృన్గారవతి నార చీర లూనె
            భూజనంబులు మెచ్చు భోజనంబు లొనర్చు
                    కమలాక్షి కందమూలములు నమలె
            చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు
                    జవ్వని ముని పర్ణశాల నుండె
            మరులుతో శ్రీరాము సురముపై బవళించు
                    బాలికామణి యొంటి పవ్వళించె

    గీ     గన్ను సన్నల శుద్ధాంతకాంత లాడ
            రించు సేవలు మెచ్చని కాంచనాంగి
            యొగ్గె మునిముగ్ధ కాంతాకృతోపచార
            విధికి, నెంచ నసాధ్యంబు విధికి గలదె



Srii vidyAM jagatAM dhAtriiM sarga sthiti layESvariiM
            namAmi lalitAM nityAM mahA tripura suMdariiM

navaratnOjvala kAMtivaMtamidi dhanyaMbaina sUryAMvayO
        dhbava rAjanyulu munnu dAlci garimaM pAliMci rii bhUmi saM     
        sthavaniiyaMbagu nii kiriiTamu SirOdhAryaMbu nii kii yeDaM
        bhuvi pAliMpu prajAnuraMjakamugA mOdaMbutO rAghavA !

saptASvaradha mArUDhaM pracaMDaM kaSyapAtmajaM
            SvEtapadmadharaM dEvaM taM sUryaM praNamAmyahaM


rAvaNu saMhariMci, raghurAmuDu durbhara kiili kiilalaM
         pAvaniyaina siita, nasamAna pativrata lOkamAta saM
         bhAvanajEsi gaikoni, suparvulu meccaga, laxmaNuMDu, su
         griivuDu, vAyunaMdanuDu, priitini golva ayOdhya jErinaM !!

E mahaniiya sAdhvi jagadEka pavitrata brahma rudra su
         trAmulu havyavAhanuDu prastuti cEsiro, aTTi talli sii
         tA mahiLA SirOmaNini, dAruNa kAnana viidhi kaMpagA
         nii madi yeTTu loppe? neTa nErciti vii kaThinatva magrajA 

==

     u   iMtaku bUnivacci vaciyiMpaka pOdune, vinmu talli, du
         SciMtulu, daityucEbaDina siitanu grammar'a nElucunnavA
         DeMta vimOhi rAmuDani, yeggulu palkina nAlakiMci, bhU
         kAMtuDu niMdajeMdi ninu gAnala lOpala diMci rammaneM

     ca   pratidina mEnu tolduluta pAdamulaMTi namaskariMci, nii
          yatulitamaina diivanala naMdi cariMtu, tadiiya bhAgya mii
          gati yeDa mAye, niMkepuDu gAMtu bhavatpadapadmamul nama
          SSatamulu sEtunamma kaDasAri grahiMpumu jAnakii satii.

     ca   ide mana yASramaM bicaTa niivu vasiMpumu, lOkapAvanii
          sadamalavRtti niiku paricaryalu sEyudu rii tapasvinul
          mudamuga rAmanAmanu tapOvanamella pratidhvaniMcu
          nii padamulu sOki mA yuniki pAvanamai celuvoMdu nammarO.

 
    sii     raMgAru baMgAru ceMgAvulu dhariMcu 
                    SRngAravati nAra ciira lUne
            bhUjanaMbulu meccu bhOjanaMbu lonarcu
                    kamalAxi kaMdamUlamulu namale
            caMdrakAMta viSAla caMdraSAlala nuMDu
                    javvani muni parNaSAla nuMDe
            marulutO SriirAmu suramupai bavaLiMcu
                    bAlikAmaNi yoMTi pavvaLiMce

    gii     gannu sannala SuddhAMtakAMta lADa
            riMcu sEvalu meccani kAMcanAMgi
            yogge munimugdha kAMtAkRtOpacAra
            vidhiki, neMca nasAdhyaMbu vidhiki galade


EDIT