|
Mana Ghantasala Song LyricsvasudEvuDu nirata satyaprauDhi dharaNi nElina hariScandru |
| Movie:kRshNaliilalu | Lyrics: |
| Music:susarla daxiNAmUrti | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna Kandadai | |
వసుదేవుడు నిరత సత్యప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రు
డీ ధర బాసి చనగలేదె
ఎల్లలోకము లేలి యెసగు శ్రీ నలరాజు తన
వెంట భూమిని గొనుచు చనెనే
కృత యుగంబునకు అలంకృతి జేయు
మాంధాత సిరిమూట గట్టుక నరుగ గనెనే
జలధి సేతువు గట్టి యలరారు శ్రీరాముడు
వుర్విపై యిప్పుడు నున్నవాడె
ఎందరెందరొ రాజులు ఏగినారు ! బావా !
ఒక్కరును వెంట గొనిపోవ రుర్వితలము
నీవు మాత్రము రాజ్యంబు నీదు సిరియు
తలను కట్టుకుపోదువో ధర్మహృదయా !
| |
vasudEvuDu nirata satyaprauDhi dharaNi nElina hariScaMdru
Dii dhara bAsi canagalEde
ellalOkamu lEli yesagu Srii nalarAju tana
veMTa bhUmini gonucu canenE
kRta yugaMbunaku alaMkRti jEyu
mAMdhAta sirimUTa gaTTuka naruga ganenE
jaladhi sEtuvu gaTTi yalarAru SriirAmuDu
vurvipai yippuDu nunnavADe
eMdareMdaro rAjulu EginAru ! bAvA !
okkarunu veMTa gonipOva rurvitalamu
niivu mAtramu rAjyaMbu niidu siriyu
talanu kaTTukupOduvO dharmahRdayA !
| |