Mana Ghantasala Song Lyrics

saikataliMgaMbu jaladhipAlavu nADu

Movie:bhUkailAsLyrics:?
Music:aar sudarSanam, aar gOvardhanamSingers:ghaMTasaala
Submitted by: Krishna Kandadai

         సైకతలింగంబు జలధిపాలవు నాడు
              తల్లికిచ్చిన మాట తప్పినావు
         కరుణింప వచ్చిన కైలాస నాథుని
              అడుగరాని వరము లడిగినావు
         అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను
              వలపు పల్కుల మది గలచినావు
         కామాంధ కారమ్ము కనుగవ గప్పగా
              సకల పాతకములు సలిపినావు

         పాపములు పండి, నరక గర్భంబులోన
         కూలనుండిన నీ పయి జాలి బూని
         కావగా నెంచు నా యుప కారమునకు
         నీ వొసంగు ఉపాయనంబిదియె కూళ

         saikataliMgaMbu jaladhipAlavu nADu
              tallikiccina mATa tappinAvu
         karuNiMpa vaccina kailAsa nAthuni
              aDugarAni varamu laDiginAvu
         akhila lOkArAdhyayau jaganmAtanu
              valapu palkula madi galacinAvu
         kAmAMdha kArammu kanugava gappagA
              sakala pAtakamulu salipinAvu

         pApamulu paMDi, naraka garbhaMbulOna
         kUlanuMDina nii payi jAli bUni
         kAvagA neMcu nA yupa kAramunaku
         nii vosaMgu upAyanaMbidiye kULa

EDIT