Mana Ghantasala Song Lyrics

indruDu manasu niidani nalunaku mATanicce

Movie:appucEsi pappu kUDuLyrics:pingaLi nAgEndra rAvu
Music:#S.# rAjESvara rAvuSingers:ghaMTasaala, mAdhavapeddi, liila
Submitted by: Krishna Kandadai

   ఇంద్రుడు     మనసు నీదని నలునకు మాటనిచ్చె
               నౌర, దమయంతి! ఆమె స్వయంవరమట! 
               ఇపుడు తన మాట నెటుల చెల్లించగలదొ!
               అది పరిక్షింపవలె రండు అమరులార!

   ఇంద్రుడు     శుభమస్తు! నలరాజ! సురనాధుడను నేను
                        యమ వరుణులు వీరు, అగ్ని ఇతడు
   నలుడు      ఐన ధన్యుడను, మీ అభిమత మేమియో
                        తెలుపుడు, నెరవేర్పగలను నేను 
   ఇంద్రుడు     దమయంతి మాలోన తన యిచ్చవచ్చిన                   
                        సుందరు వరియింప చూడవలయు
   నలుడు      సరికాని, దేవ ! ఆ సరసాంగి సుద్ధాంత
                        సీమకు నేనెట్లు చేరగలను?

   ఇంద్రుడు     అమరులకు రాయబారివై అరుగు వేళ
               నిట్టి శంకలు భయములు నేల నీకు? 
               దీని శిరమున ధరియింతువేని పరుల
               కేరికిని కానరావు నరేంద్ర! చనుమ!

    దమయంతి  చూడ నధ్బుతమయ్యె, శుద్ధాంత సీమకు
                        చేరిన దివ్యులు మీరలెవరొ? 
    నలుడు     నారీ శిరోమణీ! నలుడనువాడను                    
                        సురదూతనై నిన్ను చూడవలసె 
               వరుణేంద్ర యమ వహ్నిసురలలో నొక్కరి         
                        వరియింప వలెనట, తరుణి నీవు
    దమయంతి  హంస మాటలు విని, ఆత్మేశుగా మిమ్మె
                        వలచితి నెటుల నన్యుల దలంతు?
    నలుడు     సంతోశమే కాని, అంతటి వేల్పుల
                        కాదన కశ్టముల్ కలుగు సబల

    దమయంతి  కశ్టములనైన సుఖములుగా దలంతు
               మీకు నర్ధాంగి నగుటయె నాకు చాలు
               వేల్పులకు మ్రొక్కి ఎంతయు వినుతి జేసి
               వారె దీవింప మిమ్ము నే బడయుదాన

    దమయంతి  నలరాజేంద్రు వరించియుంటి నతడే నా నాధుడెన్నేని జ
               న్మలకీ శోధన లేల! దీననగు నం మన్నించి శాంతింపరే
               చలముం వీడరె! కామరూప మహిమల్ చాలించి పుణ్యాత్ములై
               నలునిం నన్ను ననుగ్రహించి దయతో న్యాయంబు పాలింపరే!

   iMdruDu     manasu niidani nalunaku mATanicce
               naura, damayaMti! Ame svayaMvaramaTa! 
               ipuDu tana mATa neTula celliMcagalado!
               adi parixiMpavale raMDu amarulAra!

   iMdruDu     Subhamastu! nalarAja! suranAdhuDanu nEnu
                        yama varuNulu viiru, agni itaDu
   naluDu      aina dhanyuDanu, mii abhimata mEmiyO
                        telupuDu, neravErpagalanu nEnu 
   iMdruDu     damayaMti mAlOna tana yiccavaccina                   
                        suMdaru variyiMpa cUDavalayu
   naluDu      sarikAni, dEva ! A sarasAMgi suddhAMta
                        siimaku nEneTlu cEragalanu?

   iMdruDu     amarulaku rAyabArivai arugu vELa
               niTTi SaMkalu bhayamulu nEla niiku? 
               diini Siramuna dhariyiMtuvEni parula
               kErikini kAnarAvu narEMdra! canuma!

    damayaMti  cUDa nadhbutamayye, SuddhAMta siimaku
                        cErina divyulu miiralevaro? 
    naluDu     nArii SirOmaNii! naluDanuvADanu                    
                        suradUtanai ninnu cUDavalase 
               varuNEMdra yama vahnisuralalO nokkari         
                        variyiMpa valenaTa, taruNi niivu
    damayaMti  haMsa mATalu vini, AtmESugA mimme
                        valaciti neTula nanyula dalaMtu?
    naluDu     saMtOshamE kAni, aMtaTi vElpula
                        kAdana kashTamul kalugu sabala

    damayaMti  kashTamulanaina sukhamulugA dalaMtu
               miiku nardhAMgi naguTaye nAku cAlu
               vElpulaku mrokki eMtayu vinuti jEsi
               vAre diiviMpa mimmu nE baDayudAna

    damayaMti  nalarAjEMdru variMciyuMTi nataDE nA nAdhuDennEni ja
               nmalakii SOdhana lEla! diinanagu naM manniMci SAMtiMparE
               calamuM viiDare! kAmarUpa mahimal cAliMci puNyAtmulai
               naluniM nannu nanugrahiMci dayatO nyAyaMbu pAliMparE!

EDIT