Mana Ghantasala Song Lyrics

bommanu cEsI praaNamu pOsee

Movie:DevataLyrics:SreeSree
Music:S.P.KOdandapaniSingers:Ghantasala
Submitted by: Sreenadh

బ్రతుకంతా బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరిగిపోయే

తలచేది జరుగదు - జరిగేది తెలియదుబొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా (౨)

గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక  (బొమ్మను)అందాలు సృశ్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీవె తుడిచేవులే

దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే

కొండంత ఆశ అడియాస చేసి పాతాళలోకాన త్రోసేవులే  (బొమ్మను)ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అదియే మరుభూమిగా నీవు మార్చేవులే

అనురాగమధువు అందించి నీవు హాలాహలజ్వాల చేసేవులే

ఆనందనౌక పయనించు వేళ శోకాలసంద్రాన ముంచేవులే   (బొమ్మను)