Mana Ghantasala Song Lyrics

neevaina ceppave O muraLi

Movie:SreekRshNaaMjanEya yudhdhaMLyrics:si. naaraayaNa reDDi
Music:Ti.vi.raajuSingers:ghaMTasaala, suSeela
Submitted by: PM

నీవైన చెప్పవె ఓ మురళి ఇక నీవైన చెప్పవె ప్రియ మురళి 

నీవైన చెప్పవె ఓ మురళి

అడుగడుగున నా ప్రియ భామినికి అలుక ఎందుకని ఎందుకని ము?

నీవైన చెప్పవె ఓ మురళి



నీవైన చెప్పవె జాబిలి ఇక నీవైన చెప్పవే ఓ జాబిలి

నీవైన చెప్పవె జాబిలి 

తలబంతి ఎవరో పద దాసి ఎవరో తెలుసుకొమ్మని పిదప రమ్మని

నీవైన చెప్పవె జాబిలి 



అలుకలోన నా చెలియ వదనము అరుణకమలమై విరిసెనని

ఆ కమలములోని తేనియలానగ ఆ..ఆ..కమలములోని తేనియలానగ

నా మది భ్రమరమై ఎగిసెననీ నీవైన చెప్పవె ఓ మురళి



కొటి పూలతో కులుకు తుమ్మెదకు ఈ తోటలో చోటు లేదని

మనసెరిగిన సత్యావిధేయునికి ఆ..ఆ..మనసెరిగిన సత్యావిధేయునికి 

అనురాగమధువు అందునని



నీవైన చెప్పవె జాబిలి ఇక నీవైన చెప్పవే ఓ జాబిలి
neevaina ceppave O muraLi ika neevaina ceppave priya muraLi 
neevaina ceppave O muraLi
aDugaDuguna naa priya bhaaminiki aluka eMdukani eMdukani mu?
neevaina ceppave O muraLi

neevaina ceppave jaabili ika neevaina ceppavE O jaabili
neevaina ceppave jaabili 
talabaMti evarO pada daasi evarO telusukommani pidapa rammani
neevaina ceppave jaabili 

alukalOna naa celiya vadanamu aruNakamalamai virisenani
aa kamalamulOni tEniyalaanaga aa..aa..kamalamulOni tEniyalaanaga
naa madi bhramaramai egisenanI neevaina ceppave O muraLi

koTi poolatO kuluku tummedaku ee tOTalO cOTu lEdani
manaserigina satyaavidhEyuniki aa..aa..manaserigina satyaavidhEyuniki 
anuraagamadhuvu aMdunani

neevaina ceppave jaabili ika neevaina ceppavE O jaabili