Mana Ghantasala Song Lyrics

madhurabhaavaala sumamaala

Movie:jaijawaan - 1970Lyrics:si. naaraayaNa reDDi
Music:saaloori raajESwararaavu Singers:ghaMTasaala, suSeela
Submitted by: PM

మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ

పసిడి కలలేవొ చిగురించె ప్రణయ రాగాలు పలికించె



(మధుర భావాల...ఈ వేళ)



ఎదను అలరించు హారములొ పొదిగితివి ఎన్ని పెన్నిధులో (౨)

మరువరాని మమతలన్ని వెలిసిపోవాలి కన్నులలో



(మధుర భావాల...ఈ వేళ)



సిరుల తులదూగు చెలివున్న కరుణ చిలికేవు నాపైన(౨)

కలిమి కన్న చెలిమి మిన్న కలవు మణులెన్నొ నీలోన



(మధుర భావాల...ఈ వేళ)



ఒకే పథమందు పయనించి ఒకే గమ్యమ్ము ఆసించి(౨)

ఒకే మనసై ఒకే తనువై ఉదయ సిఖరాలు చేరితిమి



(మధుర భావాల...రాగాలు పలికించె)
madhura bhaavaala sumamaala manasulO pooce ee vELa
pasiDi kalalEvo ciguriMce praNaya raagaalu palikiMce

(madhura bhaavaala...ee vELa)

edanu alariMcu haaramulo podigitivi enni pennidhulO (2)
maruvaraani mamatalanni velisipOvaali kannulalO

(madhura bhaavaala...ee vELa)

sirula tuladoogu celivunna karuNa cilikEvu naapaina(2)
kalimi kanna celimi minna kalavu maNulenno neelOna

(madhura bhaavaala...ee vELa)

okE pathamaMdu payaniMci okE gamyammu aasiMci(2)
okE manasai okE tanuvai udaya sikharaalu cEritimi

(madhura bhaavaala...raagaalu palikiMce)