Mana Ghantasala Song Lyrics

aaDavE jalakammulaaDavE

Movie:vicitra kuTuMbaMLyrics:si. naaraayaNaReddi
Music:Ti. vi. raajuSingers:ghaMTasaala, suSeela
Submitted by: Ravi

ప్:  ఆడవే  ఆడవే

      ఆడవే జలకమ్ములాడవే (౨)

      కలహంసలాగ  జలకన్యలాగ (౨)

      !! ఆడవే !!



చ్౧: ఆదికవి నన్నయ్య అవతరించిన నేల

      తెలుగుభారతి అందియలు పల్కె ఈ నేల

      ఆంధ్ర సంస్కృతికి తీయని క్శీరధారలై

      జీవకళలొల్కు గోదావరి తరంగాల

      !! ఆడవే !!      



చ్౨: నాగార్జునుని బోధనలు ఫలించినచోట

      బౌద్ధమత వృక్శమ్ము పల్లవించినచోట  

      బుద్ధం శరణం గఛ్ఛామి

      ధర్మం శరణం గఛ్ఛామి

      సంఘం శరణం గఛ్ఛామి

      క్రిశ్ణవేణీ తరంగిణి జాలిగుండెయై

      సాగరమ్మై రూపు సవరించుకొను నీట

      !! ఆడవే !!      



చ్౩: కత్తులును ఘంటములు కదము తొక్కినవిచట (౨)

      అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట

      నాటిరాయల పేరు నేటికిని తలపోయు

      తుంగభద్రానది తోయమాలికలందు

      !! ఆడవే !!