Mana Ghantasala Song Lyrics

dayacEyaMDi dayacEyaMDi tamaMtavaarika lEraMDi

Movie:maayaa bajaarLyrics:piMgaLi naagEMdra raavu
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, maadhavapeddi, bRMdaM
Submitted by: Ravi

ప్: దయచేయండి దయచేయండి  తమంత వారిక లేరండి (౨)

     తమంత వారిక లేరండి (౨)

     అతి ధర్మాత్ములు అతి పుణ్యాత్ములు అతి ధీమంతులు మీరండి

     తగు కైవారం తగు సత్కారం  తగుమాత్రంగా గైకోండి

     తమంత వారిక తమరండి  ఈ తతంగమంతా తమకండి



చ్౧: పెళ్ళికుమారా రావయ్య  మా భాగ్యం కొద్ది దొరికావయ్యా (౨)

      ముల్లోకాలను వెదికి తెచ్చిన అల్లుడవంటే నీవయ్య

      ముల్లోకాలను గాలించి తెచ్చిన అల్లుడవంటే నీవయ్య

      పల్లకినిక దిగి రావయ్య

      తతంగమంతా నీకయ్య  ఈ తతంగమంతా నీకయ్య



చ్౨: కిరీటాలు కిరీటాలు  వజ్రాల కిరీటాలు  ధగ ధగ కిరీటాలు

      ధరించినంతనే తలలో మెరయును భలే యోచనలు బ్రహ్మాండముగా 

      శిరస్త్రాణములు శిరోధార్యములు శిరోజరక్శలు  కిరీటాలివి

      అందుకోండయ్య  దొరలు ముందుకు రండయ్య (౨)



చ్౩: హారాలు  మణిహారాలు  

      హారాలు మణిహారాలు  పతకాలు నవపతకాలు (౨)

      మణిబంధాలు భుజబంధాలు  అందాలకు అనుబంధాలు

      వింతచీరలు  వింతముసుగులు (౨)  సంతోశాలకు సంబంధాలు

      అందుకోండమ్మ తల్లులు ముందుకు రండమ్మ (౨)



చ్౪: రక్శలు రక్శలు  పాదరక్శలు  నాట్యశిక్శలో బాలశిక్శలు (౨)

      తొడిగినతోడనే తోధిమి తోధిమి  అడుగువేయగానే తైతక్క తైతక్క (౨)

      నేలమీదనిక  నిలువనీయక  కులాసాగ మిమ్ము నర్తింపజేసే

      రక్శలు రక్శలు  పాదరక్శలు  నాట్యశిక్శలో బాలశిక్శలు (౨)



ఒకటే మా వయసు  ఓ రాజా ఒకటే మా సొగసు (౨)



చ్౫: లయగారమున కళరా  వయ్యారమున వలరా (౨)

      హోయ్ నేనే నీజోడురా  నేనే నీ ఈడురా (౨)

      వన్నెచిన్నెలెన్నరావో  రాజా

      !! ఒకటే !!



చ్౬: సరసతలో ఇది జాణరా  రసికతలో ఇది రాణిరా (౨)

      హోయ్ నిన్నే కోరితిరా  నిన్నే చేరితిరా (౨)

      వన్నెచిన్నెలెన్నరావో  రాజా (౨)

      !! ఒకటే !!