Mana Ghantasala Song Lyrics

mukkOTi dEvatalu okkaTainaaru

Movie:baavaamaradaLLuLyrics:aarudra
Music:ke vi mahadEvanSingers:ghaMTasaala
Submitted by: Ravi

ప్:  ముక్కోటి దేవతలు ఒక్కటైనారు  చక్కన్ని పాపను ఇక్కడుంచారు (౨)

      ఎక్కడున్నా గాని  దిక్కు వారే కదా  చిక్కులను విడదీసి దరిచేర్చలేరా

      !! ముక్కోటి !!



చ్౧: ఆలి ఎడబాటెపుడూ అనుభవించెడివాడు  అలమేలుమంగపతి అవనిలో ఒకడే

      ఏడుకొండలవాడు  ఎల్లవేళలయందు  దోగాడుబాలునికి తోడునీడవుతాడు

      !! ముక్కోటి !!



చ్౨: నెల్లూరిసీమలో చల్లంగ శయనించు  శ్రీరంగనాయక  ఆనందదాయక

      తండ్రిమనసుకు శాంతి  తనయునికి శరణున్ను  దయసేయుమా నీవు తణము యడబాయక

      !! ముక్కోటి !!



చ్౩: ఎల్లలోకాలకు తల్లివైనీవుండ  పిల్లవానికి ఇంక తల్లిప్రేమా కొరత

      బరువాయె బ్రతుకు  చెరువాయె కన్నీరు (౨)  కరుణించు కాపాడు మా కనకదుర్గ

      !! ముక్కోటి !!



చ్౪: గోపన్నవలె వగచు  ఆపన్నులను గామ్చి  బాధలను తీర్చేటి భద్రాద్రివాసా (౨)

      నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా  చిన్నారి బాలునకు శ్రీరామరక్శ

      !! ముక్కోటి !!



చ్౫: బాలప్రహ్లాదుని లాలించి బ్రోచిన  నారసింహునికన్న వేరు దైవములేదు

      అంతుతెలియగరాని ఆవేదనలు గలిగే (౨)  చింతలను తొలగించు సింహాచలేశా

      !! ముక్కోటి !!