Mana Ghantasala Song Lyrics

okasaari kalalOki raavayyaa

Movie:gOpaaluDu-bhoopaaluDu - 1967Lyrics:si. naaraayaNa reDDi
Music:es. pi. kOdaMDapaaNiSingers:ghaMTasaala, jaanaki
Submitted by: PM

గొల్ల గోపన్న



ఒకసారి కలలోకి రావయ్యా...



ఒకసారి కలలోకి రావయ్యా

నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా ఓ గొల్ల గోపయ్యా



ఒకసారి రాగానే ఏమౌనులే

నీ ఃఋదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే



పగడాల నా మోవి చిగురించెరా

మోము చెమరించెరా మేను పులకించెరా 

సొగసు వేణువు చేసి పలికించరా (౨)



చెమ్మోవి పై తేనె ఒలికించనా (౨)

తనివి కలిగించనా మనసు కరిగించనా

కేరింత లాడించి శోలించనా (౨)



ఒకసారి కలలోకి రావయ్య ఆ..ఆ..



వొంపు సొంపుల మెరుపు మెరిపించవే

వగలు కురిపించవే మేను మరపించవే

మరపులో మధుకీల రగిలించవే (౨)



చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా (౨)

మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా

పదును తేరిన వలపు పండించరా (౨)












golla gOpanna

okasaari kalalOki raavayyaa...

okasaari kalalOki raavayyaa
naa uvviLLu kavviMchi pOvayyaa O golla gOpayyaa

okasaari raagaanE EmounulE
nee HRdayaana SayaniMchi uMTaanulE ElukoMTaanulE

pagaDaala naa mOvi chiguriMcheraa
mOmu chemariMcheraa mEnu pulakiMcheraa 
sogasu vENuvu chEsi palikiMcharaa (2)

chemmOvi pai tEne olikiMchanaa (2)
tanivi kaligiMchanaa manasu karigiMchanaa
kEriMta laaDiMchi SOliMchanaa (2)

okasaari kalalOki raavayya aa..aa..

voMpu soMpula merupu meripiMchavE
vagalu kuripiMchavE mEnu marapiMchavE
marapulO madhukeela ragiliMchavE (2)

chilipi choopula siggu kaligiMdiraa (2)
mogga toDigiMdiraa murisi virisiMdiraa
padunu tErina valapu paMDiMcharaa (2)