Mana Ghantasala Song Lyrics

adi okka ramaNiiya pushpa vanamu-maavana maMdoka mEDa-mEDapai nadi

Movie:PrivateLyrics:jandhyAla pApayyaSAstri
Music:GhantasalaSingers:Ghantasala
Submitted by: Neeraja
అది ఒక్క రమణీయ పుష్ప వనము-ఆవనమందొక మేడ-మేడపై అది యొక
మారుమూల గది-ఆ గది తల్పులు తీసి మెల్లగా పదునయిదేండ్ల
యీడుగల బాలిక-పోలిక రాచపిల్ల-జంకొదవెడు కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగాన్‌!

ఆ అమ్మాయి యిటువైపే వస్తున్నది .....
ఈ నది వద్ద ఆమెకేం పనో?

కన్నియ లాగె వాలకము కంపడుచున్నది
కన్నియ లాగె వాలకము కంపడుచున్నది కాదు కాదు ఆ
చిన్ని గులాబి లేత యరచేతులలో పసిబిడ్డ డున్న య
ట్లున్నది యేమి కావలయునో గద ఆమెకు అచ్చుగ్రుద్దిన న
ట్లున్నవి రూపురేఖ అచ్చుగ్రుద్దిన నట్లున్నవి రూపురేఖ-లెవరో యనరా దతడామె బిడ్డయే!

ఆమె సంతోష పడుతున్నదా లేక దుఖిస్తున్నదా?

దొరలు ఆనంద బాష్పాలో పొరలు దుఖ
బాష్పములో గాని యవి గుర్తుపట్టలేము;
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి
బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద!

ఓహో! తెలిసింది....

గాలి తాకున జలతారు మేలిముసుగు
జారె నొక్కింత (2)
యదిగో! చిన్నారి మోము!పోల్చుకొన్నాములే! కుంతి భోజపుత్రి
స్నిగ్ధ సుకుమారి యామె కుంతీకుమారి!!

ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితిని బో ఆతండు రానేల? వ
చ్చెను బో కన్నియనంచు నెంచక ననుం జేపట్టగా నేల? ప
ట్టెను బో పట్టి నొసంగనేల? అడుగంటెం కుంతి సౌభాగ్యముల్‌

అయ్యో భగవానుడా

ఈ విషాదాశ్రువుల తోడ ఇంక యెంత
కాలము ఈ మేను మోతు? గంగాభవాని (2)
కలుష హారిణి యీ తల్లి కడుపులోన
కలిసి పోయెద నా కన్న కడుపుతోడ

ఈ విధంగా నిశ్చయించుకొని బిడ్డను రొమ్ముల్లో అదుముకుంటూ కుంతీకుమారి నదిలోకి దిగి పోతున్నది .... ఇంతలో....నదీ తరంగాల్లో తేలుతూ ఒక్క పెట్టె అక్కడికి కొట్టుకుని వచ్చింది...
కుంతీకుమారి కన్నుల్లో ఆశా కిరణాలు మెరసాయి. ఈశ్వరేఛ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది. ఆమె ఆత్మహత్యనుంచి విరమించుకుంది. పెట్టెనిండా
ఒత్తుగా పూలగుత్తులు, చిగురుటాకులు పేర్చింది. మెత్తగా పక్క దిద్దితీర్చింది. ఒత్తుకోకుండా చేత్తో ఒత్తి చూచింది ...ఎలాగో గుండెలు బిగపటుకోని
ఎలాగో గుండెలు బిగపటుకోని...

బాష్పముల సాము తడిసిన ప్రక్క మీద
చిట్టితండ్రిని బజ్జూండ బెట్టె తల్లి
బజూండ బెట్టె తల్లి

భోగ భాగ్యాలతో తులదూగుచున్న
కుంతి భోజుని గారాబు కూతురు నయి
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన.

నా చిట్టి బాబూ!

పెట్టియలోన నొత్తిగిల బెట్టి నినుం నడి గంగలోనికిం
నెట్టుచు నుంటి తండ్రి! యిక నీకును నాకునుఋణంబుదీరె; మీదెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నాపుట్టుక మాసిపోను! నిను బోలిన రత్నము నాకు దక్కునే!

అయ్యో తండ్రీ!

పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము (2)
నేనెన్నటికైన చూతునె! మరే! దురదృష్టము గప్పికొన్న నా కన్నుల కంత భాగ్యమును కల్గునె?
ఏఅమ్మయైనయింత నీకన్నము పెట్టి ఆయువువిడినప్పటి మాట గదోయి నాయనా!"
తల్లీ! గంగాభవానీ!

బాల భానుని బోలు నా బాలు నీదు
గర్భమున నుంచు చుంటి గంగా భవాని! (2)
వీని నేతల్లి చేతిలోనైన బెట్టి
మాట మన్నింపు మమ్మ! నమస్సు లమ్మ!నమస్సు లమ్మ!
నమస్సు లమ్మ!
మరులు రేకెత్త బిడ్డను మరల మరల
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగించి
పెట్టెలోపల నుంచి జోకెట్టె తల్లి.జోకెట్టె తల్లి
ఆమె మాతృహృదయం తటపట కొట్టుకుంటున్నది పాపం ...

ఆత పత్రమ్ము భంగి కంజాత పత్ర
మొండు బంగారు తండ్రిపై ఎండ తగుల
కుండ సంధించి (2)
ఆకులోనుండి ముద్దు
మూతిపై కడపటి ముద్దు నునిచి
నన్ను విడిచి పోవుచుండె మా నాన్న యనుచు
కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తముల తోడ కాంక్షలల్లాడ కనులు
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె.

నదీ తరంగాల్లో పెట్టె కొట్టుకొని పోతున్నది .....

ఏటి కెరటాలలో పెట్టె యేగుచుంద
గట్టుపై నిల్చి అట్టె నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష
లోచనమ్ములతో కుంతి చూచుచుండె కుంతి చూచుచుండె.

బాబూ ... బాబూ ... మా నాన్నా ... నాన్నా ...



adi okka ramaNiiya pushpa vanamu-aavanamaMdoka mEDa-mEDapai adi yoka
mArumUla gadi-aa gadi talpulu tiisi mellagA padunayidEMDla
yiiDugala bAlika-pOlika rAcapilla-jaMkodaveDu kALLatODa digucunnadi kriMdiki meTlamiidugAn!

aa ammAyi yiTuvaipE vastunnadi .....
ii nadi vadda aamekEM panO?

kanniya lAge vAlakamu kaMpaDucunnadi
kanniya lAge vAlakamu kaMpaDucunnadi kAdu kAdu aa
cinni gulAbi lEta yaracEtulalO pasibiDDa Dunna ya
Tlunnadi yEmi kAvalayunO gada aameku accugruddina na
Tlunnavi rUpurEKa accugruddina naTlunnavi rUpurEKa-levarO yanarA dataDAme biDDayE!

aame saMtOsha paDutunnadA lEka dukhistunnadA?

doralu AnaMda bAshpAlO poralu dukha
bAshpamulO gAni yavi gurtupaTTalEmu;
rAlucunnavi aame nEtrAlanuMDi
bAlakuni muddu cekkuTaddAla miida!

OhO! telisiMdi....

gAli tAkuna jalatAru mElimusugu
jAre nokkiMta (2)
yadigO! cinnAri mOmu!pOlcukonnAmulE! kuMti bhOjaputri
snigdha sukumAri yAme kuMtiikumAri!!

muni maMtrammu nosaMganEla? iDebO munmuMdu mArtAMDu ra
mmani nE kOraganEla? kOritini bO AtaMDu rAnEla? va
ccenu bO kanniyanaMcu neMcaka nanuM jEpaTTagA nEla? pa
TTenu bO paTTi nosaMganEla? aDugaMTeM kuMti souBAgyamul

ayyO bhagavAnuDA

ii vishAdASruvula tODa iMka yeMta
kAlamu ii mEnu mOtu? gaMgAbhavAni  (2)
kalusha hAriNi yii talli kaDupulOna
kalisi pOyeda nA kanna kaDuputODa

ii vidhaMgA niScayiMcukoni biDDanu rommullO adumukuMTuu kuMtiikumaari nadilOki digi pOtunnadi .... iMtalO....nadii taraMgAllO tElutU okka peTTe akkaDiki koTTukuni vacciMdi...
kuMtiikumAri kannullO aaSA kiraNAlu merasAyi. iiSwarECCa ilA unnadani gurtiMciMdi. aame aatmahatyanuMci viramiMcukuMdi. peTTeniMDA
ottugA poolaguttulu, ciguruTAkulu pErciMdi. mettagA pakka didditiirciMdi. ottukOkuMDA cEttO otti cUciMdi ...elaagO guMDelu bigapaTukOni
elaagO guMDelu bigapaTukOni...

bAshpamula sAmu taDisina prakka miida
ciTTitaMDrini bajjUMDa beTTe talli
bajUMDa beTTe talli

bhOga bhAgyAlatO tuladUgucunna
kuMti bhOjuni gArAbu kUturu nayi
kanna nalusuku oka paTTe Dannamaina
peTTukO nOcanaiti pApishThidAna.

nA ciTTi bAbuu!

peTTiyalOna nottigila beTTi ninuM naDi gaMgalOnikiM
neTTucu nuMTi taMDri! yika niikunu nAkunuRNaMbudiire; miideTTula nunnadO mana yadRshTamu! ghOramu cEsinAnu nApuTTuka mAsipOnu! ninu bOlina ratnamu nAku dakkunE!

ayyO taMDrii!

punnama caMdamAma saripOyeDi nii varahAla mOmu  (2)
nEnennaTikaina cUtune! marE! duradRshTamu gappikonna nA kannula kaMta bhAgyamunu kalgune?
EammayainayiMta niikannamu peTTi aayuvuviDinappaTi mATa gadOyi nAyanA!"
tallii! gaMgAbhavAnii!

bAla bhAnuni bOlu nA bAlu niidu
garbhamuna nuMcu cuMTi gaMgA bhavAni!  (2)
viini nEtalli cEtilOnaina beTTi
mATa manniMpu mamma! namassu lamma!namassu lamma!
namassu lamma!
marulu rEketta biDDanu marala marala
nettukonucu pAliMDlapai nottukonucu
bujjagiMpula mamakAra mujjagiMci
peTTelOpala nuMci jOkeTTe talli.jOkeTTe talli
aame mAtRhRdayaM taTapaTa koTTukuMTunnadi pApaM ...

aata patrammu bhaMgi kaMjAta patra
moMDu baMgAru taMDripai eMDa tagula
kuMDa saMdhiMci (2)
aakulOnuMDi muddu
mUtipai kaDapaTi muddu nunici
nannu viDici pOvucuMDe mA nAnna yanucu
karuNa gadgada kaMThiyai kaMpamAna
hastamula tODa kAMxalallADa kanulu 
mUsikoni niiTilOniki drOse peTTe.

nadii taraMgAllO peTTe koTTukoni pOtunnadi .....

ETi keraTAlalO peTTe yEgucuMda
gaTTupai nilci aTTe nirGAMtapOyi
niScala niriiha niirasa nirnimEsha
lOcanammulatO kuMti cUcucuMDe kuMti cUcucuMDe.

bAbuu ... bAbuu ... mA nAnnA ... nAnnA ...