Mana Ghantasala Song Lyrics

veerabhimanyu padyaalu

Movie:VeerabhimanyuLyrics:Samudrala (Sr), Bhagwad geeta
Music:K.V.MahadevanSingers:Ghantasala
Submitted by: Sreenivas Parichuri
ఆమె: వాడిన పూలె వికసించెనె
వాడిన పూలె వికసించెనె
చెరవీడిన హ్రుదయాలు పులకించెనె
వాడిన పూలె వికసించెనె

అతడు: తీయని కలలె ఫలియించెనె
తీయని కలలె ఫలియించెనె
యల కొయిల తన గొంతు సవరించెనె
తీయని కలలె ఫలియించెనె

ఆమె: వెయి రెకులు విరిసింది జలజం
అతడు: తీయ తెనియ కొసరింది బ్రమరం
ఆమె: లొకమె ఒక ఉద్యానవనము
లొటులెదిక మనదీ సుఖము
అతడు: తీయని కలలె ఫలియించెనె
యల కొయిల తన గొంతు సవరించెనె
తీయని కలలె ఫలియించెనె

అతడు: పగలె జాబిలి ఉదయించెనెలా
ఆమె: పగలె ? పరిహాసమెలా
అతడు: పగలె జాబిలి ఉదయించెనెలా
ఆమె: పగలె ? పరిహాసమెలా
తెట ? నీ నవ్వు మొగమె ? నెలరెని వలెనె
ఆమె: వాడిన పూలె వికసించెనె
చెరవీడిన హ్రుదయాలు పులకించెనె
వాడిన పూలె వికసించెనె

ఆమె: జీవితాలకు నెడె వసంతం
అతడు: చెడిరిపొవని ప్రెమనుబంధం

ఇద్దరు: ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధుర్మన్‌
వాడిన పూలె వికసించెనె
చెరవీడిన హ్రుదయాలు పులకించెనె
వాడిన పూలె వికసించెనె



aame:   vaaDina puule vikasinchene
vaaDina puule vikasinchene
cheraviiDina hrudayaalu pulakinchene
vaaDina puule vikasinchene

ataDu:   teeyani kalale phaliyinchene
teeyani kalale phaliyinchene
yala koyila tana gontu savarinchene
teeyani kalale phaliyinchene

aame:    veyi rekulu virisindi jalajam
ataDu:   tiiya teniya kosarindi bramaram
aame:    lokame oka udyaanavanamu
         loTuledika manadii sukhamu
ataDu:   teeyani kalale phaliyinchene
         yala koyila tana gontu savarinchene
         teeyani kalale phaliyinchene

ataDu:   pagale jaabili udayinchenelaa
aame:    pagale ? parihaasamelaa
ataDu:   pagale jaabili udayinchenelaa
aame:    pagale  ? parihaasamelaa
         teTa ? nii navvu mogame ? nelareni valene
aame:    vaaDina puule vikasinchene
         cheraviiDina hrudayaalu pulakinchene
         vaaDina puule vikasinchene

aame:    jiivitaalaku neDe vasantam
ataDu:   cheDiripovani premanubandham

iddaru:  aalapinchina aananda giitam
         aalakinchaga madhuram madhurman
         vaaDina puule vikasinchene
         cheraviiDina hrudayaalu pulakinchene
         vaaDina puule vikasinchene




౧. 

పరిత్రాణాయ సాధూనాం

వినాశాయచ దుశ్కృతాం

ధర్మ సంస్థాపనార్థాయ

సంభవామి యుగే యుగే



౨.

పాలకడలి వంటి పాండవాగ్రజు మదిన్‍ 

కోపాగ్ని రగిలి భగ్గుమనునాడు

గంధ గజేంద్రమ్ము కరణి భీముడు నిన్ను 

నీ సహోదరుల మ్రందించు నాడు

పరమేశు నోర్చిన పార్ధుడు గాండీవ

మంది కర్ణుని దునుమాడు నాడు

మాయారణ విదుండు మా ఘటోత్కచుడు నీ

బలగమ్ము గంగలో కలుపు నాడు



ఎదిరి గెలువంగ నేర్తువే? ఇందరేల?

అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యు

డొక్కడే చాలు సంగరమోర్చి గెలువ

ఈ మహావీరులందెవ్వరేని యడ్డు

రారు, నిను గావగా లేరు రాజరాజ!



౩.

నీ సఖులన్‍, సహోదరుల, నిన్ను నిమేశములో వధిన్చి నే

నీ సభలో సమాధి యొనరింపగ జాలుదు, కాని మీ తలన్‍

వ్రాసె విధాత దుర్మృతిని పాండు కుమారుల చేత, లోక సం

త్రాసము నాపగా తరమె! తప్పదు యుద్ధము, బంధు నాశమున్‍



౪.

స్థాణుడె తోడుగా ప్రమధ సంఘముతో రణ సీమ నిల్చినన్‍

ద్రోణు నెదిర్చి మొగ్గరము ధూళిగ జేసెద, నాదు ధాటికిన్‍

త్రాణులు దప్పి పారు కురురాజును, కర్ణుని, దుస్ససేనునిన్‍

ప్రాణము తోడ బట్టికొని వచ్చెద! ఇచ్చెద మీకు కాన్కగా!



౫.

అనిమిశ, దైత్య, కింపురుశులాదిగ ఎవ్వరు వచ్చి గాచినన్‍

దునుముదు రేపు సైంధవుని, తోయజమిత్రుడు గ్రుంక కుండు ము

న్ను, నర వరేణ్యు ఇత్తెరగు నా కొనరిమ్పగ రాక యున్న, నే

ననలము సొచ్చువాడ, నృపులందరు చూడగ గాండివమ్ముతో!



౬.

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం