Mana Ghantasala Song Lyrics

raamanaama saMkeertanamE

Movie:raksharEkha (1949)Lyrics:balijEpalli lakshmeekaantaM
Music:Ogiraala raamachaMdraraavuSingers:Ghantasala
Submitted by: Sreenivas Paruchuri

రామనామ సంకీర్తనమే ! రక్తి భుక్తి జీవన్ముక్తి

రామనామ జపమే ! సుమనోరంజనంబురా 



నామకుసుమ పూజ చేసీ శ్రీమహేశ్వరీ తరియించె

ప్రేమసుధా సారము చిలికీ కామితార్థముల నొసగే

తపో యజ్~న దానాదులచే తరము గాని బ్రహ్మ పదవి

మనసు నిల్పి రామాయని లో మనన జేసినంతనే దొరికే 		(రామనామ)



శబరి యే తపంబు చేసే గుహుడు యేమి జపము జేసే

శరణమన్న మాత్రన కాదే విభీశణుడు తా తరియించె

రామనామ జపమే! సుమనోరంజనంబురా

రామరామ శ్రీరఘురామా రామరామ సీతారామా!