Mana Ghantasala Song Lyrics

evarO jwAlanu ragilincAru

Movie:DA. cakravartiLyrics:Athreya
Music:S. Rajeshwara RaoSingers:Ghantasala
Submitted by: Panini

ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు (౨)

(ఎవరో)



అడుగు అడుగునా అపజయములతో అలసి సొలసిన నా హృదయానికి

సుధవై, సుధవై జీవనసుధవై ఉపశాంతినివ్వగా ఓర్వనివారలు

(ఎవరో)



అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటే (౨)

ఆనందంతో మురిసానే, ఆత్మీయులుగా తలచానే అందుకు ఫలితం అపనిందేనా

(ఎవరో)



మనిశి మనిశికీ మమత కూడదా మనసు తెలుసుకొను మనసే లేదా

ఇది తీరని శాపం, ఇది మారని లోకం, మానవుడే దానవుడై మసలే చీకటి నరకం

(ఎవరో)