బలెబలెబలెబలె బలే
ఓహియహ . . .
ఓ వన్నెలచిన్నెల కన్నియా
నీ నల్లని జడలో పూలు నా గుండెలలో బాణాలు
ఓ పిల్ల! నీ నల్లని జడలో పూలు నా గుండెలలో బాణాలు
నీవెవరికి మనసిచ్చావే (౨)
ఏ యహ!
ఈ చల్లని వెన్నెలరేయి నా మనసును దోచితివోయి
ఓ రాజా! ఈ చల్లని వెన్నెలరేయి నా మనసును దోచితివోయి
నా సొగసులు నీకొరకేలే (౨)
ఏ యహ!
ఆ చక్కని చుక్కల~రేడు నీ అందము చూచెను నేడు (౨)
ఏదొ కలతపడి తన మనసు చెడి (౨)
తెరలో దాగే ఎందుకే (నీ నల్లని జడలో)
నీ చక్కని మనసును చూచి తన మచ్చను మదిలో తలచి (౨)
ఏదొ కలతపడి తన మనసు చెడి (౨)
తెరలో దాగే అందుకే (ఈ చల్లని వెన్నెలరేయి)
నువు వలచినవాడె నవాబు నువు మరచిననాడు గరీబు
నువు మరచిననాడు గరీబు
నువు పిలచిన నాకు హుశారు నను తలవనిచో బేజారు
మము తలవనిచో బేజారు
(నే మెచ్చినాను రావే
నువ్ నచ్చినావు లేవోయ్) (౨)
పదవే పోదాం హాయిగా (ఈ చల్లని వెన్నెలరేయి)
|