అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి (౨)
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న (౨)
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండికూడ చవటలయ్యారు, వొట్టి చవటలయ్యారు (అనగనగా)
పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటిదీపమార్పివేయ నెంచెనొక్కడు
తల్లీతండ్రులు విశమని తలచెనొక్కడు (౨)
పడుచుపెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడూ, భ్రమసెనొక్కడు (అనగనగా)
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను (౨)
కంటిపాప కంటె ఎంతొ గారవించెను (౨)
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను తానుండసాగెను (అనగనగా)
నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా (౨)
కూరిమి గలవారంతా కొడుకులేనురా (౨)
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా, కుక్క మేలురా (అనగనగా)
|