నరుల జీవిత పథమున నడుపువాడు
కాళ్ళు లేని అభాగ్యుడై కనలె నేడు
స్నేహితుని గుండె శోకపు చితిగ మారె
ప్రణయమూర్తికి బ్రతుకొక ప్రళయమాయె
శాంతి సుఖముల తేలెడు జీవితముల
చిచ్చు పెట్టుటే దైవ విలాసమేమో, దైవ విలాసమేమో
ఎవరికి వారౌ స్వార్థంలో, హృదయాలరుగవు లోకంలో (౨)
నాకై వచ్చిన నెచ్చెలివే
అంఋతం తెచ్చిన జాబిలివే, నాకంఋతం తెచ్చిన జాబిలివే
ధనము కోరి మనసిచ్చే ధరణి మనిశిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లి వలె ఒడిని జేర్చి నన్నోదార్చేవే
నాకై వచ్చిన నెచ్చెలివే
అంఋతం తెచ్చిన జాబిలివే, నాకంఋతం తెచ్చిన జాబిలివే
ప్రేమ కొర్''అకు ప్రేమించేవారే కానరాక గాలించాను
గుండెలు తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ మ్రోగాయి, నా కంటిపాపను అన్నాయి
నాకై వచ్చిన నెచ్చెలివే
అంఋతం తెచ్చిన జాబిలివే, నాకంఋతం తెచ్చిన జాబిలివే
ఈ అనురాగం ఈ ఆనందం, ఎవ్వరెరుగని ఈ అనుబంధం (౨)
ఊడలు పాతీ, నీడలు పరచీ
ఉండాలీ వెయ్యేళ్ళు, చల్లగ ఉండాలీ వెయ్యేళ్ళు
తీయగ పండాలి మన కలలు
ఎవరికి వారౌ స్వార్థంలో, హృదయాలరుగవు లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివే
అంఋతం తెచ్చిన జాబిలివే, నాకంఋతం తెచ్చిన జాబిలివే
|