Mana Ghantasala Song Lyrics

kASI paTnaM chooDarabAbU kallA kapaTaM lEni garIbU

Movie:vAgdAnam (1961)Lyrics:SrISrI
Music:penDyAlaSingers:ghaMTasaala, suSIla
Submitted by: Krishna Kondaka
ఒహో, నిలబడితే పడీపోయే నీరసపు నీడ వంటి బీదవాడా!
మనిషిగా బ్రతికేందుకు కనీసావసరాలైనా లేనివాడా!
అయ్యయ్యయ్యయ్యయ్యో!

కాశీ పట్నం చూడరబాబూ
కల్లా కపటం లేని గరీబూ
కాశీ పట్నం చూడరబాబూ
కల్లా కపటం లేని గరీబూ
అల్లో లక్ష్మణ అని అల్లాడే
పల్లెల దుస్థితి కేమి జవాబు ? (అల్లో) (కాశీ)

నిరాశతోను నిస్ప్రుహలోను
తెరువెరుగని నిరుపేదలు
మురికి గుంటలు ఇరుకు కొంపలు
నిండిన చీకటి పేటలు
పాడు రోగాలు మోసుకు తిరిగి
ప్రజలను చంపే ఈగలు
కరువూ బరువూ పరితాపాలూ
కలిసి వెరసి మన పల్లెలు

కాశీ పట్నం
కాశీ పట్నం చూడరబాబూ
కల్లా కపటం లేని గరీబూ (కాశీ)

శరీరాల్లో అరచటకయినా రక్తం లేని దరిద్రులనే పీల్చుకు
తింటడు దోమ రాక్షసుడు !
వాడి దుంప తెగ!
మేడల్లో మిద్దెల్లో నివసించే వారి జోలికైనా పోడుగదా
అయ్యయ్యయ్యయ్యయ్యో!

వైద్య సహాయం అసలే లేదు
ఉన్నా దొరకవు మందులు
డాక్టరు కోసం వెతికే లోగా
రోగులు గుటుక్కు మందురు
నెత్తురు పీల్చే వ్రుత్తిపరులె మన
గ్రామాలకు కామందులు
దొరలూ దోమలు పల్లె జనాలను
పంచుకు నంజుకు తిందురు


కాశీ పట్నం
కాశీ పట్నం చూడరబాబూ
కల్లా కపటం లేని గరీబూ (కాశీ)

ప్రజలతో సమానంగా కష్టసుఖాలను పంచుకుంటా మంటారు
మన వినాయకులు,
ఔనౌను ! సుఖాలన్నీ తమకు దక్కించుకొని
కష్టాలన్నీ మనకు వదిలేస్తారు !
అయ్యయ్యయ్యయ్యయ్యో !

ఎవరో వచ్చి సాయం చేస్తా
రనుకోవడమే పొరపాటు
పదవులు వస్తే ప్రజను మరవడం
బడానాయకుల అలవాటు
మనలో శక్తి మనకే తెలియదు
అదేకదా మన గ్రహపాటు
తెలిసీ కలిసీ నిలిచిన నాడు
ఎదుటి వాడికది తలపోటు

కాశీ పట్నం
కాశీ పట్నం చూడరబాబూ
కల్లా కపటం లేని గరీబూ (కాశీ)


ohO, nilabaDitE paDIpOyE nIrasapu nIDa vaMTi bIdavADA!
manishigA bratikEMduku kanIsAvasarAlainA lEnivADA!
ayyayyayyayyayyO!

kASI paTnaM chooDarabAbU
kallA kapaTaM lEni garIbU
kASI paTnaM chooDarabAbU
kallA kapaTaM lEni garIbU
allO lakshmaNa ani allADE
pallela dusthiti kEmi jawAbu ?   (allO)   (kASI)

nirASatOnu nispruhalOnu
teruverugani nirupEdalu
muriki guMTalu iruku koMpalu
niMDina chIkaTi pETalu
pADu rOgAlu mOsuku tirigi
prajalanu chaMpE eegalu
karuvU baruvU paritApAlU
kalisi verasi mana pallelu

kASI paTnaM
kASI paTnaM chooDarabAbU
kallA kapaTaM lEni garIbU     (kASI)

SarIrAllO arachaTakayinA raktaM lEni daridrulanE pIlchuku
tiMTaDu dOma rAkshasuDu !
vADi duMpa tega!
mEDallO middellO nivasiMchE vAri jOlikainA pODugadA
ayyayyayyayyayyO!

vaidya sahAyaM asalE lEdu
unnA dorakavu maMdulu
DAkTaru kOsaM vetikE lOgA
rOgulu guTukku maMduru
netturu pIlchE vruttiparule mana
grAmAlaku kAmaMdulu
doralU dOmalu palle janAlanu
paMchuku naMjuku tiMduru


kASI paTnaM
kASI paTnaM chooDarabAbU
kallA kapaTaM lEni garIbU     (kASI)

prajalatO samAnaMgA kashTasukhAlanu paMchukuMTA maMTAru
mana vinAyakulu,
ounounu ! sukhAlannI tamaku dakkiMchukoni
kashTAlannI manaku vadilEstAru !
ayyayyayyayyayyO !

evarO vachchi sAyaM chEstA
ranukOvaDamE porapATu
padavulu vastE prajanu maravaDaM
baDAnAyakula alavATu
manalO Sakti manakE teliyadu
adEkadA mana grahapATu
telisI kalisI nilichina nADu
eduTi vADikadi talapOTu

kASI paTnaM
kASI paTnaM chooDarabAbU
kallA kapaTaM lEni garIbU     (kASI)