Mana Ghantasala Song Lyrics

Movie:peLLi chEsi chUDuLyrics:Pingali
Music:Ghantasala ( Kalyani raagam)Singers:Ghantasala
Submitted by: Neeraja

ఓ భావి భారత భాగ్య విధాతలారా

యువతీ యువకులారా ..స్వానుభవమున చాటు నా

సందేశమిదే... వారెవ్వా...

తాధిన్న తకధిన్న తాంగిటకతక తరికిటకతోం

పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్

ఎల్లరి సుఖము చూడాలోయ్  మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

హాయిగా ఉండాలోయ్



కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి

కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా

పట్నాల పల్లెల దేశదేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా

తాధిన్న తకధిన్న తాంగిటకతక తరికిటకతోం

ఇంటా బయటా జంటకవులవలె అంటుకు తిరగాలోయ్  తరంపం 

కంటిపాప వలె దంపతులెపుడు చంటిపాపలను సాకాలోయ్ (పెళ్ళి)



నవ భావముల నవరాగముల

నవ జీవనమే నడపాలోయ్

నవ భావముల నవరాగముల

నవ జీవనమే నడపాలోయ్

భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ (పెళ్ళి)