Mana Ghantasala Song Lyrics

puttaDi bomma, pUrNamma

Movie:Non FilmLyrics:gurajaaDa appaaraavu
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, bRMdaM
Submitted by: Sreenivas Paruchuri
_సు_: మనసు మమత మనిషికి ఇచ్చి, మనిషికి మనినిషినే శత్రువు చేసి (2)
రాగం కన్నా త్యాగం గొప్పని చల్లని నిప్పును రగిలించీ, రగిలించి
నాటకమాడుట నీ లీల, నలిగి నశించుట మా పాలా
ఈ పాపం ఫలితం ఎవ్వరిది, ఓ భగవాం నీది, నీది

ప్ర: ఈ పాపం ఫలితం ఎవ్వరిది, ఓ భగవాం నీది, నీది (2)
పరిహాసానికి ఏదో అన్నది ప్రళయంగా ఇటు ముగిసినది (2)
ప్రణయజీవులను విడదీసి బ్రతుకులు బద్దలు చేసినది
ఈ పాపం ఫలితం ఎవ్వరిది, ఓ భగవాం నీది, నీది

ఘం': నా కున్నది ఒకటే హృదయం, అది చేసినదొకటే స్నేహం (2)
నే నెరిగిన దొకటే ధర్మం, అది చూపినదొకటే మార్గం
ఏ కన్నులు కన్నీరైనా, ఏ కలలే కలగి పోయినా
ఈ పాపం ఫలితం ఎవ్వరిది, ఓ భగవాం నీది, నీది


_su_:    manasu mamata manishiki ichchi, manishiki maninishinE Satruvu chEsi (2)
raagaM kannaa tyaagaM goppani challani nippunu ragiliMchee, ragiliMchi
naaTakamaaDuTa nee leela, naligi naSiMchuTa maa paalaa
ee paapaM phalitaM evvaridi, O bhagavaaM needi, needi

pra:    ee paapaM phalitaM evvaridi, O bhagavaaM needi, needi (2)
parihaasaaniki EdO annadi praLayaMgaa iTu mugisinadi (2)
praNayajeevulanu viDadeesi bratukulu baddalu chEsinadi
ee paapaM phalitaM evvaridi, O bhagavaaM needi, needi

ghaM':  naa kunnadi okaTE hRdayaM, adi chEsinadokaTE snEhaM (2)
nE nerigina dokaTE dharmaM, adi choopinadokaTE maargaM
E kannulu kanneerainaa, E kalalE kalagi pOyinaa
ee paapaM phalitaM evvaridi, O bhagavaaM needi, needi



పుత్తడి బొంమ, పూర్ణంమ



మేలిమి బంగరు మెలతల్లారా!

కలవల కన్నుల కన్నెల్లారా!

తల్లుల గన్నా పిల్లల్లారా!

విన్నారంమా యీ కథనూ!



ఆటలు పాటల పేటికలారా

కంమని మాటల కొంమల్లారా!

అంమలగన్నా అంమల్లారా!

విన్నరంమా మీరీ కథనూ!



కొండల నడుమన కోనొకటున్నది!

కోనకి నడుమా కొలనొకటుందీ!

కొలని గట్టునా కోవెల లోపల

వెలసెను బంగరు దుర్గంమా



పూజారింటను పుట్టెను చిన్నది

పుత్తడి బొంమా పూర్ణంమా;

అన్నల తంముల కనుగై దుర్గకు

పూజకు పువ్వులు కోసేది



ఏయే వేళల పూసే పువ్వుల

ఆయా వేళల అందించీ

బంగరు దుర్గను భక్తితొ కొలిచెను

పుత్తడి బొంమా పూర్ణంమా



ఏయే ఋతువుల పండే పళ్ళను

ఆయా ఋతువుల నందించీ

బంగరు దుర్గను భక్తితొ కొలిచెను

పుత్తడి బొంమా పూర్ణంమా



పళ్లను మీరిన తీపుల నడలును

పువ్వులు మీరిన పోడుములుం

అంగము లందున అమరెను పూర్ణకు

సౌరులు మించెను నానాటం



కాసుకు లోనై తల్లీ తండ్రీ

నెనరూ న్యాయం విడనాడీ

పుత్తడి బొంమను పూర్ణంమను నొక

ముదుసలి మొగడుకు ముడి వేస్రీ



ఆమని రాగా దుర్గ కొలనులో

కలకల నవ్వెను తామరలు

ఆమని రాగా దుర్గ వనములో

కిలకిల పలికెను కీరములు



ముద్దు నగవులూ మురిపెములూ మరి

పెనిమిటి గాంచిన నిమిశమున

బాసెను కన్నియ ముఖ కమలంమున

కన్నుల గ్రంమెను కన్నీరు



ఆటల పాటల తోటి కన్నియలు

మొగుడు తాత యని కేలించ

ఆటల పాటల కలియక పూర్ణమ

దుర్గను చేరీ దుక్కించె



కొన్నాళ్ళకు పతి కొనిపో వచ్చెను

పుత్తడి బొంమను పూర్ణమను

చీరెలు సొంములు చాలగ దెచ్చెను

పుఉత్తడి బొంమకు పూర్ణమకు



పసుపు రాసిరి బంగరు మేనికి

జలకము లాడెను పూర్ణంమ;

వదినెలు పూర్ణకు పరిపరి విధముల

నేర్పులు మెరపీ కై చేస్రీ



పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణంమ

తల్లీ తండ్రీ దీవించ్రీ

దీవన వింటూ పక్కున నవ్వెను

పుత్తడి బొంమా పూర్ణంమా



చిన్నల నందర కౌగిట చేర్చుకు

కంటను బెట్టెను కన్నీరూ

అన్నల తంముల నప్పుడు పలికెను

పుత్తడి బొంమా పూర్ణంమా



అన్నల్లారా, తంముల్లారా!

అంమను అయ్యను కానండీ!

బంగరు దుర్గను భక్తితొ కొలవం

డంమల కంమా దుర్గంమా



ఆయా వేళల పూసే పువ్వుల

ఆయా ఋతువుల పళ్ళన్నీ

భక్తిని గోసీ శక్తికి యివ్వం

డంమల కంమా దుర్గంమా



నలుగురు కూచుని నవ్వే వేళల

నా పేరొక పరి తలవండీ!

మీమీ కన్న బిడ్డల నొకతెకు

ప్రేమను నా పేరివ్వండీ!



బలబల కన్నుల కన్నీరొలికెను

పుత్తడి బొంమా పూర్ణమకూ

కన్నులు తుడుచుకు కలకల నవ్వెను

పుత్తడి బొంమా పూర్ణంమా



వగచిరి వదినెలు, వగచిరి తంములు,

తల్లియు కంటను తడి బెట్టెం

కాసుకు లోనై అల్లుని తలచుకు

ఆనందించెను అయ్యొకడె!



యెప్పటి యట్టుల సాయంత్రంమున

యేరిన పువ్వులు సరి గూర్చీ

సంతోశంమున దుర్గను కొలవను

వొంటిగ పోయెను పూర్ణంమ



ఆవులు పెయ్యలు మందలు జేరెను

పిట్టలు చెట్లను గుమిగూడెం

మింటను చుక్కలు మెరయుచు పొడమెను

యింటికి పూర్ణమ రాదాయె!



చీకటి నిండెను కొండల కోనల

మేతకు మెకములు మెసల జనెం

దుర్గకు మెడలో హారము లమరెను

పూర్ణమ యింటికి రాదాయె!



కన్నుల కాంతులు కలవల చేరెను

మేలిమి జేరెను మేని పసల్

హంసల జేరెను నడకల బెడగులు

దుర్గను జేరెను పూర్ణంమా!