Mana Ghantasala Song Lyrics

vinu vinu vinu ninu vadalanu nirASa cEyaku

Movie:paruvu - pratishThaLyrics:Arudra?
Music:penDyAlaSingers:ghaMTasaala, suSiila
Submitted by: Sreenivas Paruchuri

విను విను విను నిను వదలను నిరాశ చేయకు

నడు నడు నడు నా దారిని విడు చిరాకు చేయకు



వలచి నేను వెంటబడితె అదో నేరమా

పిలిచి నీకు బానిసనైతె యింత కోపమా

పిలువకనే పేరంటానికి తయారౌదువా?

చిలిపితనం ఆపి మనసు చిత్తగించవా (విను విను విను)



అనాదిగా ఆడవారు ఇదే మోస్తరు

అలకతోనె కాలమంతా వృధా చేతురు

అలా అలిగి హృదయము ఏమో తెలిసికొందురు

ఆకతాయి కుర్రాడైతే ఆగమందురు (విను విను విను)



మనసంతా తెలుపుటవలనే మరీ లోకువా

చెంతచేరి బాసలు నీతో చేయనీయవా

చెంతచేరి తెలుపకపోతే వూహ తెలియదా

ఎంత దూరమైనా మనసు నీకు చేరువా (విను విను విను)