Mana Ghantasala Song Lyrics

annalAra tammulAra ArOgyame bhAgyamu manabhAgyamu saubhAgyamu

Movie:rEcukka pagaTicukkaLyrics:samudrAla (jyUniyar)
Music:#T.V# rAjuSingers:ghaMTasaala, mAdhavapeddi bRndam
Submitted by: Krishna Kandadai
అన్నలార తమ్ములార ఆరోగ్యమె భాగ్యము మనభాగ్యము సౌభాగ్యము
చిన్నపెద్దలందరికీ కావలసిన భాగ్యము మహభాగ్యము సౌభాగ్యము
అన్నలార తమ్ములార ఆరోగ్యమె భాగ్యము మహభాగ్యము సౌభాగ్యము

సామూ గరిడీలు చేయాలోయ్‌ తమ్ముడూ
కండబలం గుండెబలం కలుగుతుంది తమ్ముడూ
దండ చరచి నిలబడితే ఎదురుండదు ఎన్నడూ
అహ ఎదురుండదు ఎన్నడూ (అన్నలార)

ఆసనాలు వేస్తే పనివుండదు ఇక మందూ
శ్వాశకోశ రోగాలు అంతటితో బందూ
కాసు ఖర్చు లేదు అహ ఫలితముంది మీముందూ
అహ ఫలితముంది మీముందూ (అన్నలార)

ఎన్నడైన దేశానికి వెన్నుకాపు పని వున్నా
నిన్ను నీవు కాచుకొని నిలవాలని అనుకున్నా
కావాలన్నా సత్తువ కావాలన్నా అన్నా లేకపొతే పని సున్నా
అన్నా లేకపోతే పని సున్నా (అన్నలార)

కత్తికర్ర చేతపట్టి చిత్తుగాక మన మూక
ఎగరేసి జయపతాక చూపారూ తమ తఢాక
గురుతుంచుకొ నీవారీ పేరూ చెడగొట్టబోక
అన్నా పేరూ చెడగొట్టబోక (అన్నలార)


annalAra tammulAra ArOgyame bhAgyamu manabhAgyamu saubhAgyamu
cinnapeddalaMdarikii kAvalasina bhAgyamu mahabhAgyamu saubhAgyamu
annalAra tammulAra ArOgyame bhAgyamu mahabhAgyamu saubhAgyamu

sAmU gariDiilu cEyAlOy tammuDU
kaMDabalaM guMDebalaM kalugutuMdi tammuDU
daMDa caraci nilabaDitE eduruMDadu ennaDU
aha eduruMDadu ennaDU                           (annalAra)

AsanAlu vEstE panivuMDadu ika maMdU
SvASakOSa rOgAlu aMtaTitO baMdU
kAsu kharcu lEdu aha phalitamuMdi miimuMdU
aha phalitamuMdi miimuMdU                       (annalAra)

ennaDaina dESAniki vennukApu pani vunnA
ninnu niivu kAcukoni nilavAlani anukunnA
kAvAlannA sattuva kAvAlannA annA lEkapotE pani sunnA
annA lEkapOtE pani sunnA                        (annalAra)

kattikarra cEtapaTTi cittugAka mana mUka
egarEsi jayapatAka cUpArU tama taDhAka
gurutuMcuko niivArii pErU ceDagoTTabOka
annA pErU ceDagoTTabOka                         (annalAra)


EDIT