| Movie:Non Film ? | Lyrics:samudrAla jUniyar |
| Music:#G. K.# venkaTESvarlu | Singers:ghaMTasaala, liila |
| Submitted by: Sreenivas Paruchuri |
నందన వనమీ సుందర జగమే
అందము చిందే వలపు చందము నాదే ఆ విందులు నావే
పున్నమి చందురు సోయగమూ
కన్నులజూచీ కైరవమూ
విరిసే నదియేలా తెలుపవె బాలా
ఉదయించే రవి రాగ మొలికీ తామర చెలికీ
కితకితలా వింతలూ చేయునదీ యేలనో "నందన"
మలపై వెలసిన సెలయేరూ
గలగల నీరధి దరిజేరూ
పరుగుల తెరగేమో - ఆ పాటలదేమో
తుంమెదలూ పూలబాల చేరీ తేనెలగ్రోలీ
భ్రమియించే నెందుకో - సెలయేరు అందుకే
కనులను ప్రియులను కనగానే
పెనగొను మమతలు మదిలోనే
అదియే జీవనమూ మానవ జీవనమూ
జగమెల్ల వలపు పూలతోట తేనియపాట
అతిప్రేమ సుందరం - ఆనంద మందిరం
నందన వనమీ - సుందర జగమే
అందము చిందే వలపు చందము మాదే ఈ విందులు మావె
|