(ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా) (౨)
(ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
(ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే)
(పెదవులు రెండూ కలగలిసినచో తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో మమతకు లేదు హద్దు) (౨)
చూడు ఉబలాటం ఆడు చెలగాటం (౨)
పెడమోమైనా విడువను నిన్ను వద్దుర మొగమాటం
(ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే)
ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్ (౨)
మోఞు పడకుంటే మొగవాడే కాదు (౨)
గడసరి బిగువు సడలించనిదే జవరాలే కాదు
(ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే)
|