Mana Ghantasala Song Lyrics

chiMta cheTTu chiguru chooDu

Movie:adRshTavantuluLyrics:aarudra
Music:K.V. mahadEvanSingers:ghaMTasaala, suSeela
Submitted by: Panini

చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు

చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్ (౨)

చింత చెట్టు చిగురు చూడు, చిన్నవాడి బెదురు చూడు

చింత చెట్టు కాపుకొచ్చిందోయ్ నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ (౨)



పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది (౨)

వగలమారి వాలుచూపు వ~ర్~రగున్నది (౨)

అది వెంటపడితె ఏదేదో వె~ర్~రిగున్నది (చింత చెట్టు)



పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నది (౨)

జబర్దస్తీ చేస్తుంది ఞబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది (౨) (చింత చెట్టు)



వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది (౨)

ఇంతలేసి కన్నులతో మంతరిస్తది (౨)

అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది (చింత చెట్టు)