Mana Ghantasala Song Lyrics

ayyayyO brahmayyaa anyaayam chESaavEmayyaa

Movie:adRshTavantuluLyrics:C. Narayana Reddy
Music:K.V. MahadevanSingers:Ghantasala
Submitted by: Panini

(అయ్యయ్యో బ్రహ్మయ్యా, అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా, అయా, యా, యా) (౨)

అయ్యయ్యో బ్రహ్మయ్యా



చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు (౨)

బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు (౨)

కొంత కోడెతనముంది .. మరి కొంత ఆడతనముంది, హోయ్‍ (అయ్యయ్యో బ్రహ్మయ్యా)



మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు (౨)

ఆ కసరు లోనే అలకనవ్వుల విసురు లేక పోలేదు

కొంత చిలిపితనముంది .. మరి కొంత కలికితనముంది, హోయ్‍ (అయ్యయ్యో బ్రహ్మయ్యా)



బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే (౨)

కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా (౨)

కవ్వించే కౌగిలిలో .. కరగించక మానేరా, హోయ్‍ (అయ్యయ్యో బ్రహ్మయ్యా)