Mana Ghantasala Song Lyrics

aanaaTi madhura vasantam

Movie:bhalE abbaayilu (19??)Lyrics:sree sree
Music:GhantasalaSingers:ghaMTasaala
Submitted by: Madan Mohan Parigi
ఆనాటి మధుర వసంతం
ఈనాటి రుధిర హేమంతం
ఆనాటి తీయని సుఖం
ఈనాడు కాలకూట విషం

కాలమే విధి రూపము మానవాళికి దీపము
శొకమైనా సౌఖ్యమైనా కాలమే ప్రమాణము (కాలమే)

కలసి వచ్చిన కాలమైతే మనిషి తానే దైవము
మంచి రోజులు మారిపోతే పరుల కంటికి హీనము
పరుల కంటికి హీనము (కాలమే)

కలల వెన్నెల కరిగిపోగా
కారు చీకటి నిండెనా
పరుల పంచను బ్రతుకవలసిన
వ్రాతయే నీదాయెనా (కాలమే)

ఒకని భాగ్యము తూగుటూయల
ఒకని శాపము శోకము
కాలమెవరికి మేలుచేయునో
కాలమెవరికి కీడు చేయునో
మానవునికే తెలియరానిది
విధి విలాసము చోద్యము (కాలమే)


aanaaTi madhura vasaMtaM
eenaaTi rudhira hEmaMtaM
aanaaTi teeyani sukhaM
eenaaDu kaalakUTa vishaM

kaalamE vidhi rUpamu maanavaaLiki deepamu
Sokamainaa saukhyamainaa kaalamE pramaaNamu    (kaalamE)

kalasi vaccina kaalamaitE manishi taanE daivamu
maMci rOjulu maaripOtE parula kaMTiki heenamu
parula kaMTiki heenamu                         (kaalamE)

kalala vennela karigipOgaa
kaaru ceekaTi niMDenaa
parula paMcanu bratukavalasina
vraatayE needaayenaa                           (kaalamE)

okani bhaagyamu tUguTUyala
okani Saapamu SOkamu
kaalamevariki mElucEyunO
kaalamevariki keeDu cEyunO
maanavunikE teliyaraanidi
vidhi vilaasamu cOdyamu                        (kaalamE)


EDIT