Mana Ghantasala Song Lyrics

naa manasE gOdaari nee vayasE kaavEri

Movie:adRshTavantulu Lyrics:Arudra
Music:K.V. MahadevanSingers:Ghantasala, Suseela
Submitted by: Panini

నా మనసే గోదారి నీ వయసే కావేరి

బోల్‍ రాధా బోల్‍ రెండూ కలిసేనా లేదా

అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ కుదిరేనా లేదా  (నా మనసే)



నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు

అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు



కృశ్ణుడు నేనే రుక్మిణి నీవే రాతిరి ఎత్తుకు పోతానే

లారీ మెల్లగా తోలుకువస్తా చల్లగ లేచిపోదాము

మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం

బోల్‍ రాధా బోల్‍ గండం తప్పేనా లేదా



లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యె

ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె

మనసే ఠారెత్తె మా ప్రేమయే జావై పోయెను

గుండెలే పగిలి చద్దామింక దిక్కెవ్వరు

పోవే శాకినీ ఢాకినీ కదులు పో పో వెళ్ళిపో లంకిణీ



బోల్ అమ్మా బోల్‍ జోడీ కలిసిందా లేదా

బోల్ అత్తా బోల్‍ రోగం కుదిరిందా లేదా