Mana Ghantasala Song Lyrics

SEshaSailAvAsA

Movie:SrI vEMkaTEsvara mahatyaMLyrics:Athreya
Music:PendyalaSingers:ghaMTasAla
Submitted by: Murali
శేశశైలావాసా శ్రీవేంకటేశా

శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా



శ్రీదేవి వంకకూ చిలిపిగా చూడకు

అలమేలుమంగకూ అలుకరానీయకు

ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి

మురిపించి లాలించి ముచ్చటల తేల్చి (శేశ)



పట్టు పానుపు పైనా పవ్వళించర స్వామీ

భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ

చిరునగవు లొలుకుచూ నిదురించు నీ మోమూ

కరువు తీరా గాంచి తరియింతుమూ మేము (శేశ)
SEshaSailAvAsA SrIvEMkaTESA
SayaniMchu mA ayya SrI chidvilAsA

SrIdEvi vaMkakU chilipigA chUDaku
alamElumaMgakU alukarAnIyaku
muddu satuliddarinI iruvaipulA jErchi
muripiMchi lAliMchi mucchaTala tElci (SEsha)

paTTu pAnupu painA pavvaLiMchara svAmI
bhaktulaMdaru ninnu prastutiMchi pADa
chirunagavu lolukuchU niduriMchu nI mOmU
karuvu tIrA gAMchi tariyiMtumU mEmu (SEsha)