| Movie:bangaaru gaajulu (19??) | Lyrics:daasarathi |
| Music:T Chalapathi Rao | Singers:ghaMTasaala, suSeela |
| Submitted by: Madan Mohan Parigi |
విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక (విన్న)
నల్లని నీ కురులలో
తెలతెల తెల్లని సిరిమల్లెనై (౨)
పరిమళాలు చిలుకుతూ నే పరవశించి పోనా (విన్న)
వెచ్చని కౌగిట పవళించిన వీణనై (౨)
రాగమే అనురాగమై నీ మనసు నిండిపోనా (విన్న)
తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై (౨)
అందరాని నీలి నింగి అంచులందుకోనా (విన్న)
చల్లని నీ చూపులే చెలివెన్నెలై విరబూయగా
కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా (విన్న)
|
vinnaviMcukOnaa cinna kOrika
innaaLLu naa madilO unna kOrika (vinna)
nallani nee kurulalO
telatela tellani sirimallenai (2)
parimaLaalu cilukutU nE paravaSiMci pOnaa (vinna)
veccani kaugiTa pavaLiMchina veeNanai (2)
raagamE anuraagamai nee manasu niMDipOnaa (vinna)
teeyani nee pedavipai celarEgina oka paaTanai (2)
aMdaraani nIli niMgi aMculaMdukOnaa (vinna)
callani nee cUpulE chelivennelai virabUyagaa
kaluvanai nee celiyanai nee kannulaMdu veligEnaa (vinna)
|