Mana Ghantasala Song Lyrics

celiyaa celiyaa iTu raavE

Movie:aajanma brahmacaari (19??)Lyrics:??
Music:??Singers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
చెలియా చెలియా ఇటు రావే
నా వలపుల రాణివి నీవే నీవే
నీవు వ్రాసిన ప్రేమ లేఖ
నా జీవితాన నవ చంద్ర రేఖ

ఏమి నవ్వులవి ఇందుముఖీ
కాముని పున్నమి వెలుగులా
ఏమి అడుగులవి ప్రాణ సఖీ
ఆ మరాళముల నడకలా
అలివేణీ ! నా వయసిన్నాళ్ళూ
అడవి కాచిన వెన్నెల
ఎలనాగా నా వయసిన్నాళ్ళూ
ఎవరూ ఎరుగని ఊయల "చెలియా"

తరుణి వలె ఆ పురుషుని బ్రతుకే
తావి లేని ఒక పువ్వనీ
ఇన్ని నాళ్ళకు ఇప్పుడు తెలిసెలే
నన్ను హరించిన జవ్వనీ
ఎందుకు నాకీ బ్రహ్మచర్యము
పొందగలిగితిని నీ సాహచర్యము
ప్రణయ లోక సాంరాజ్యములేలే
మన కాపురమే దివ్యాతి దివ్యము "చెలియా"


celiyaa celiyaa iTu raavE
naa valapula raaNivi neevE neevE
neevu vraasina prEma lEkha
naa jeevitaana nava caMdra rEkha

Emi navvulavi iMdumukhee
kaamuni punnami velugulaa
Emi aDugulavi praaNa sakhee
aa maraaLamula naDakalaa
alivENee ! naa vayasinnaaLLU
aDavi kaacina vennela
elanaagaa naa vayasinnaaLLU
evarU erugani Uyala                "celiyaa"

taruNi vale aa purushuni bratukE
taavi lEni oka puvvanee
inni naaLLaku ippuDu teliselE
nannu hariMcina javvanee
eMduku naakee brahmacaryamu
poMdagaligitini nee saahacaryamu
praNaya lOka saaMraajyamulElE
mana kaapuramE divyaati divyamu    "celiyaa"