Mana Ghantasala Song Lyrics

polaalanannee

Movie:palleTUru (1952)Lyrics:SreeSree
Music:ghantasAlaSingers:ghantasAla
Submitted by: Sreenivas Paruchuri
పొలాలనన్నీ
హలాలదున్నీ
ఇలాతలంలో హేమ పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే
బలం ధరిత్రికి బలికావించే
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మ జలానికి
ఘర్మ జలానికి
ధర్మ జలానికి
ఘర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌!

నరాల బిగువూ
కరాల సత్తువ
వరాలవర్షం కురిపించాలని
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని
గనిలో వనిలో కార్ఖానాలో
పరిక్లమిస్తూ
పరిప్లవిస్తూ
ధనిక స్వామికి దాస్యం చేసే
యంత్రభూతముల కోరలు తోమే
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే
గలగల తొణకే
విలాపాగ్నులకు విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌!

నిరపరాధులై దురదృష్టంచే
చెరసాలలో చిక్కేవాళ్ళూ
లోహ రాక్షసుల పదఘట్టనచే
కొనప్రాణంతో కనలేవాళ్ళు
కష్టం చాలక కడుపుమంటలే
తెగించి సంమెలు కట్టేవాళ్ళూ
శ్రమ నిష్ఫలమై
జని నిష్ఠురమై
నూతిని గోతిని వెదకేవాళ్ళూ
అనేకులింకా అభాగ్యులంతా
అనాథులంతా
అశాంతులంతా
దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో
విప్లవశంఖం వినిపిస్తారోయ్‌!


polaalanannee
halaaladunnee
ilaatalaMlO hEma piMDaga
jagaanikaMtaa saukhyaM niMDaga
viraama merugaka pariSramiMchE
balaM dharitriki balikaaviMchE
karshaka veerula kaayaM niMDaa
kaaluvakaTTE gharma jalaaniki
gharma jalaaniki
dharma jalaaniki
gharma jalaaniki khareedu kaTTE sharaabu lEDOy!

naraala biguvoo
karaala sattuva
varaalavarshaM kuripiMchaalani
prapaMcha bhaagyaM vardhillaalani
ganilO vanilO kaarkhaanaalO
pariklamistoo
pariplavistoo
dhanika swaamiki daasyaM chEsE
yaMtrabhootamula kOralu tOmE
kaarmika veerula kannula niMDaa
kaNa kaNa maMDE
galagala toNakE
vilaapaagnulaku vishaadaaSrulaku
khareedu kaTTE sharaabu lEDOy!

niraparaadhulai duradRshTaMchE
cherasaalalO chikkEvaaLLoo
lOha raaxasula padaghaTTanachE
konapraaNaMtO kanalEvaaLLu
kashTaM chaalaka kaDupumaMTalE
tegiMchi saMmelu kaTTEvaaLLoo
Srama nishphalamai
jani nishThuramai
nootini gOtini vedakEvaaLLoo
anEkuliMkaa abhaagyulaMtaa
anaathulaMtaa
aSaaMtulaMtaa
deerghaSrutilO, teevradhwanitO
viplavaSaMkhaM vinipistaarOy!