Mana Ghantasala Song Lyrics

aMdamaina tIgaku paMdiruMTE chaalunu

Movie:bharyabiddaluLyrics:aatreya
Music:k.v.mahadevanSingers:Ghantasala
Submitted by: Neeraja
అందమైన తీగకి పందిరుంటె చాలును పైకి పైకి
పాకుతుంది చినదానా పరవశించి పాడుతుంది చినదానా ...అందమైన

గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి
తప్పటడుగులె ముందు ముందు నడకలౌతాయి
ఆశ ఉంటే మోడుకూడా చిగురు వెస్తుంది
అందమున కానందమపుడే తోడువస్తుంది (అందమైన)

పాదులోనితీగవంటిది పడుచుచిన్నది
పరువమొస్తే చిగురు వేసి వగలుబోతుంది
తగ్గ జతకై కళ్లతోటే వెతుకుతుంటుంది (అందమైన)

కళ్లు కళ్లు కలసినపుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి
అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది (అందమైన)


aMdamaina tIgaki paMdiruMTe chaalunu paiki paiki
paakutuMdi chinadaanaa paravaSiMchi paaDutuMdi chinadaanaa ...aMdamaina

guvvakegirE kOrikuMTE rekkalostaayi
tappaTaDugule muMdu muMdu naDakaloutaayi
aaSa uMTE mODukUDA chiguru vestuMdi
aMdamuna kaanaMdamapuDE tODuvastuMdi   (aMdamaina)

pAdulOnitIgavaMTidi paDuchuchinnadi
paruvamostE chiguru vEsi vagalubOtuMdi
tagga jatakai kaLlatOTE vetukutuMTuMdi  (aMdamaina)

kaLlu kaLlu kalasinapuDu kalalu vastAyi
kannepilla kalalakepuDO kaaLlu vastaayi
aDugulOna aDugu vEstU aMdamostuMdi
naDavalEni naDakalE oka naaTyamoutuMdi   (aMdamaina) 


EDIT