Mana Ghantasala Song Lyrics

aarabhi

Movie:palnATi yuddham (1966)Lyrics:jAshuvA #(traditional)#
Music:sAlUriSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
రాగం: ఆరభి

కూతురి పుస్తె దెంచితివి కొండలు పిండిగ గొట్టజాలు వి
ఖ్యాత పరాక్రమ స్థిరున కల్లునకుం విషమిచ్చి జంపి దు
ర్నీతుల పుట్టయై వగలు నేర్చిన మాయల నాయురాలికిం
చేతులు మోడ్చి పెక్కు రణ సింహుల గాంచిన పల్లనాటికిం
ఘాతుక మాచరించు పుర ఘాతుక నీతల గొట్టి కోటక్లో
పాతెదరా! నృసింహ ఘనపాతాక కాలము దాపురించెరా

రాగం: మోహన

ఆరయనాడు పెద్దపులివై నలగాముని యింట జేరి మా
కూరిమి గంగలో గలిపి గోతులు త్రవ్వుచు పండు వంటి సం
సారములందు ఆరని విషానలముం దరికొల్పు నిన్ను సం
హారము చేసినం కలుషమబ్బును పొంము దురంత పాపిణీ!


rAgaM:	aarabhi

kUturi puste deMcitivi koMDalu piMDiga goTTajAlu vi
KyAta parAkrama sthiruna kallunakuM vishamicci jaMpi du
rnItula puTTayai vagalu nErcina mAyala nAyurAlikiM
cEtulu mODci pekku raNa siMhula gAMcina pallanATikiM
GAtuka mAcariMcu pura GAtuka nItala goTTi kOTaklO
pAtedarA! nRsiMha GanapAtAka kAlamu dApuriMcerA

rAgaM:		mOhana

aarayanADu peddapulivai nalagAmuni yiMTa jEri mA
kUrimi gaMgalO galipi gOtulu travvucu paMDu vaMTi saM
sAramulaMdu aarani vishAnalamuM darikolpu ninnu saM
hAramu cEsinaM kalushamabbunu poMmu duraMta pApiNI!