Mana Ghantasala Song Lyrics

idEnanDi idEnanDi bhaagyanagaram

Movie:#M L A# (1957)Lyrics: 
Music:penDyaalaSingers:ghanTasaala, jaanaki
Submitted by: Sreenivas Paruchuri
ఈలవేసి పిలువకోయి (2)
యెగతాళి చేయకోయి
ఈ దరికి నీవింకా రాకోయి!

ఈలవేసి పిలువారాదా? (2)
ఈ మాత్రం చనువు కూడదా?
ఏ నాటికైనా మనము ఒక్కటే కదా!

వాలు కనుల వన్నెలాడి
పాలబుగ్గల సొగసులాడి (2)
గాలికూడ నిన్ను చూసి ఈల వేయునే!

కొంటె తనపు కుర్రవాడా
కోతి పనుల చిన్నవాడా (2)
చందమామ కూడ నిన్ను మందలించునోయ్‌!

మనచుట్టూ ఏకాంతం
మనదే ఈ ప్రశాంతం
కావేల నాసొంతం?
నీకేల ఈ పంతం?

నిలిచేనా నీమాట
నిలకడగా జీవితాంతం!
అవుతాయా జీవితాలు
అందంగా సౌఖ్యవంతం?

ఈలవేసి పిలువారాదా?
ఏనాటికైనా మనము ఒక్కటే కదా


iilavEsi piluvakOyi (2)
yegatALi cEyakOyi
ii dariki neeviMkA rAkOyi!

iilavEsi piluvArAdA? (2)
ii mAtraM canuvu kUDadA?
E nATikainA manamu okkaTE kadA!

vAlu kanula vannelADi
pAlabuggala sogasulADi (2)
gAlikUDa ninnu cUsi iila vEyunE!

koMTe tanapu kurravADA
kOti panula cinnavADA (2)
caMdamAma kUDa ninnu maMdaliMcunOy!

manacuTTU EkAMtaM
manadE ee praSAMtaM
kAvEla nAsoMtaM?
nIkEla ee paMtaM?

nilicEnA neemATa
nilakaDagA jeevitAMtaM!
avutAyA jeevitAlu
aMdaMgA sauKhyavaMtaM?

iilavEsi piluvArAdA?
EnATikainA manamu okkaTE kadA



ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం

మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం



పాలించెను గోలుకొండ కులీకుతుబ్ శాహి

పాలించెను గోలుకొండ కులీకుతుబ్ శాహి

భాగమతి అతని యొక్క ముద్దుల దేవి

ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు

ఆ ఊరే ఈనాడు హైదరబాదు

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం

మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం



అలనాడు వచ్చెనిట మహంమారి (౨)

అల్లా దయవల్ల ఆ పీడ పోయినాది

ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు (౨)

ఆ గుర్తే అందమైన చార్మినారు

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం

మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం



(ఇది పాడు పడిన గోలు కొండ కోట

శ్రీరాముడు కనుపించే (?) తానీశాదీ కోట) (౨)

భద్రాద్రి రామదాసు బందిఖానా (౨)

చూడండి యిదిగో (౨) ఈ కోటలోన

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం

మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం



అలనాడిది తెలుగుతల్లి అందమైన తోట (౨)

ఆంధ్ర శౌర్య వాహినులే పారినవీచోట

ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడట (౨)

కోట పట్టుకొనగ మరియేమో పట్టీనాడట

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం

మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం



వింత వస్తు శాలలు, విశాలమగు వీధులు (౨)

విద్యాలయ భవనాలు, ఉద్యాన వనాలు

కనుల కింపు చేసే కంమని నగరం

భరత మాత జడలోనే పసిడి ??ఆగరం

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం

మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం