|
Mana Ghantasala Song LyricsiilavEsi piluvakOyi (2) |
| Movie:mA yinTi mahAlaxmi (1959) | Lyrics:mallAdi |
| Music:aSwatthAma | Singers:ghaMTasaala, jikki |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
ఈలవేసి పిలువకోయి (2) యెగతాళి చేయకోయి ఈ దరికి నీవింకా రాకోయి! ఈలవేసి పిలువారాదా? (2) ఈ మాత్రం చనువు కూడదా? ఏ నాటికైనా మనము ఒక్కటే కదా! వాలు కనుల వన్నెలాడి పాలబుగ్గల సొగసులాడి (2) గాలికూడ నిన్ను చూసి ఈల వేయునే! కొంటె తనపు కుర్రవాడా కోతి పనుల చిన్నవాడా (2) చందమామ కూడ నిన్ను మందలించునోయ్! మనచుట్టూ ఏకాంతం మనదే ఈ ప్రశాంతం కావేల నాసొంతం? నీకేల ఈ పంతం? నిలిచేనా నీమాట నిలకడగా జీవితాంతం! అవుతాయా జీవితాలు అందంగా సౌఖ్యవంతం? ఈలవేసి పిలువారాదా? ఏనాటికైనా మనము ఒక్కటే కదా | |
iilavEsi piluvakOyi (2) yegatALi cEyakOyi ii dariki neeviMkA rAkOyi! iilavEsi piluvArAdA? (2) ii mAtraM canuvu kUDadA? E nATikainA manamu okkaTE kadA! vAlu kanula vannelADi pAlabuggala sogasulADi (2) gAlikUDa ninnu cUsi iila vEyunE! koMTe tanapu kurravADA kOti panula cinnavADA (2) caMdamAma kUDa ninnu maMdaliMcunOy! manacuTTU EkAMtaM manadE ee praSAMtaM kAvEla nAsoMtaM? nIkEla ee paMtaM? nilicEnA neemATa nilakaDagA jeevitAMtaM! avutAyA jeevitAlu aMdaMgA sauKhyavaMtaM? iilavEsi piluvArAdA? EnATikainA manamu okkaTE kadA | |