|
Mana Ghantasala Song LyricsgAlilO tElE pUla DOlalO |
| Movie:kalimi lEmulu (1962) | Lyrics:aarudra |
| Music:aSwatthAma | Singers:ghaMTasaala, jAnaki |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా (తీరెను) ఊహాలలోనికి ప్రయాణము ఉందామచటే నివాసము తేనెలు కురిశాయి మన జీవితాన చూచెడువారలు యీసుచెందగ (తీరెను) ఇలలో స్వర్గం ఇదే ఇదే పాడేను నామది పదే పదే పాటకు నా మది పరవశమొంది తన్మయమాయను తనివితీరగా (తీరెను) | |
tIrenu kOrika tIyatIyagaa hAyigA manasulu tElipOvagA kalasiprayANaM kalugu vinOdaM kalalu phaliMche kammakammagaa (teerenu) UhAlalOniki prayANamu uMdAmachaTE nivaasamu tEnelu kuriSAyi mana jeevitaana chUcheDuvaaralu yIsucheMdaga (teerenu) ilalO swargaM idE idE pADEnu naamadi padE padE paaTaku naa madi paravaSamoMdi tanmayamAyanu tanivitIragaa (teerenu) | |
గాలిలో గాలిలో గాలిలో తేలే పూల డోలలో గాలిలో తేలే పూల డోలలో పన్నీరు చల్లే వెన్నెల తీవె కన్నుల కలకల యేమో చిననాటి ఆనందసీమలో అలనాటి ఆనందసీమలో అదే చెలిమిగ విహరించేమని అనుకున్న కన్నె కలలే చిననాటి ఆనందసీమలో గాలిలో గాలిలో అలారుగా అలారుగా గాలిలో అలలు అలలుగా అలారుగా గానమేలే కనకవీణ నగుమోమున తళతళయేమో! చిననాటి ఆనందసీమలో అలనాటి కలల వేడుకలే మనసైన వాని చేరువ చేయ మోదములో ఆదమరచి పరవశమే చిననాటి ఆనందసీమలో గగనాన వెలిగే నెలరాజు చెంగల్వకు కలకాలము చేరువే ఆ పలుకే నిజమై ఆ మనసే తనదై కన్నె వలపు మాయని పున్నమి వెలుగాయె చిననాటి ఆనందసీమలో