Mana Ghantasala Song Lyrics

cilipi cilakamma aagu nA cEtilo uyyAla lUgu

Movie:kalimi lEmulu (1962)Lyrics:aarudra
Music:aSwatthAmaSingers:ghaMTasaala, jAnaki
Submitted by: Sreenivas Paruchuri
తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా (తీరెను)
ఊహాలలోనికి ప్రయాణము ఉందామచటే నివాసము
తేనెలు కురిశాయి మన జీవితాన
చూచెడువారలు యీసుచెందగ (తీరెను)
ఇలలో స్వర్గం ఇదే ఇదే పాడేను నామది పదే పదే
పాటకు నా మది పరవశమొంది తన్మయమాయను తనివితీరగా (తీరెను)


tIrenu kOrika tIyatIyagaa hAyigA manasulu tElipOvagA
kalasiprayANaM kalugu vinOdaM kalalu phaliMche kammakammagaa   (teerenu)
UhAlalOniki prayANamu uMdAmachaTE nivaasamu
tEnelu kuriSAyi mana jeevitaana
chUcheDuvaaralu yIsucheMdaga   (teerenu)
ilalO swargaM idE idE pADEnu naamadi padE padE
paaTaku naa madi paravaSamoMdi tanmayamAyanu tanivitIragaa (teerenu)



చిలిపి చిలకంమ ఆగు

నా చేతిలొ ఉయ్యాల లూగు

చేల పాల పిట్టల ముందు

?ఏల నందనమందు

చిలికించు తేనెవాగు

మన జంట కన్నుల పంట

మన జంట కన్నుల పంట



కొంటె కోణంగి ఆగు

నీవు నా కొంగు జలతారు పోగు

కొత్త ఉఉహలలోన, రత్న పల్లకిలోన

కోరి పెళ్ళాడి ఉఉరేగు!

ఓరయ్యో! రాజా నీకింత మోజా!

రాజా నీకింత మోజా!



చక్కని చుక్కవని సామెత వాడితే

చుక్కల లోకాన చూరెక్కి నావె

మేనరికముందని మెర మెర లాడేవు

నిన్నంటి నేనుంటె మిటకరించేవు

ముచ్చట తీర వెచ్చని

వలపు నిచ్చెన వేసి నిన్నందుకొంటా

నచ్చిన మనసు యిచ్చిన

తగని మచ్చిక నిన్ను మానేయమంటా!

ఓరయ్యో! రాజా నీకింత మోజా!



చల్లని మదిలోన జల్లేవు మోహాలు

కోకొల్ల గాక ముందే కోతల కొచ్చావు

చిత్త స్వాతి వాన జోడించి కురిసింది

వెచ్చని మమతలు మేలుగ పెరిగాయి

కన్నుల కోటి చిన్నెలు

నేటి వెన్నెల గేయాలిక వేగిరపడకు

గొప్పగ కులుకు కుప్పలు వేసి

ఒప్పుల గుప్ప ఉఉరించబోకే!

మన జంట కన్నుల పంట

మన జంట కన్నుల పంట