Mana Ghantasala Song Lyrics

:jayajaya mahadEva SaMbhO haraa (daMDakaM)

Movie:kALahasti mAhAtmyam (1954)Lyrics:tOlETi
Music:sudarSanam, gOvardhanamSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri

రాగములు       అభేరి, హిందోళం



జయ జయ మహాదేవ శంభో హరా శంకరా

సత్య శివ సుందరా నిత్య గంగాధరా

బ్రహ్మ విశ్ణుల్ సురల్ తాపసుల్

నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడం దయాసాగరా

భీకరారంయ మధ్యంబునం బోయనై పుట్టి

పశు పక్శి సంతానముల్ కూల్చి

భక్శించు పాపాత్ముడం

దివ్య జపహోమ తపమంత్ర కృశిలేని జ్~నానాంధుడం

దేవుడే లేడు లేడంచు దూశించు దుశ్టాత్ముడం

విశ్వరూపా మహామేరుచాపా

జగత్ సృశ్టి సంరక్శ సంహార కార్యత్ కలాపా

మహిం పంచ భూతాత్మ వీవే కదా

దేవ దేవా శివా!

పృథ్వి జలవాయు రాకాశ తేజో విలాసా మహేశా ప్రభో!



రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు 

కాశీ పురాధీశవిశ్వేశ్వరా (౨)

నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు

శ్రీశైల మల్లేశ్వరా

కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్శేత్రాన నివసించు

శ్రీరామలింగేశ్వరా (౨)

నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు దాక్శారమావాసభీమేశ్వరా

భీమేశ్వరా

దివ్య ఫలపుశ్ప సందోహ బృన్దార్చితానంద భూలోక కైలాస

శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా

శ్రీకాళహస్తీశ్వరా

దేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమహ్




raagamulu       abhEri, hiMdOLaM

jaya jaya mahaadEva SaMbhO haraa SaMkaraa
satya Siva suMdaraa nitya gaMgaadharaa
brahma vishNul sural taapasul
ninnu varNiMchalEranna nEneMta vaaDaM dayaasaagaraa
bheekaraaraMya madhyaMbunaM bOyanai puTTi
paSu pakshi saMtaanamul koolchi
bhakshiMchu paapaatmuDaM
divya japahOma tapamaMtra kRshilEni j~naanaaMdhuDaM
dEvuDE lEDu lEDaMchu dooshiMchu dushTaatmuDaM
viSwaroopaa mahaamEruchaapaa
jagat sRshTi saMraksha saMhaara kaaryat kalaapaa
mahiM paMcha bhootaatma veevE kadaa
dEva dEvA Sivaa!
pRthvi jalavaayu raakaaSa tEjO vilaasaa mahESaa prabhO!

raMgu baMgaaru gaMgaataraMgaala raajillu 
kaaSii puraadheeSaviSwESwaraa (2)
neeli mEghaala kELii vinOdaalalO tElu
SreeSaila mallESwaraa
kOTi nadulaMdu susnaanamul chEyu phalamicchu kshEtraana nivasiMchu
SreeraamaliMgESwaraa (2)
nitya gOdaavari nRtya saMgeeta neeraajanaalaMdu daakshaaramaavaasabheemESwaraa
bheemESwaraa
divya phalapushpa saMdOha bRndaarchitaanaMda bhoolOka kailaasa
Sailaana vasiyiMchu SreekaaLahasteeSwaraa
SreekaaLahasteeSwaraa
dEva dEvA namastE namastE namastE nama@h


EDIT