|
Mana Ghantasala Song Lyricsii jiivanatarangAlalO aa dEvuni cadarangaMlO |
| Movie:jiivana tarangAlu (1973) | Lyrics:aatreya |
| Music:#J. V.# rAGavulu | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna Kandadai | |
|
పదిమాసలు మోసావు పిల్లలను బ్రతుకంత మొసావు బాధలను యిన్ని మోసిన నిన్ను మోసేవళ్ళులేక వెళ్ళుతుంనావు ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము కడుపు చించుకు పుట్టిందొకరూ కాటికి నిన్ను మోసేదొకరూ తలకి కొరివి పెట్టేదొకరూ ఆపైని పోవచేదెవరూ (ఆపైని) (ఈ జీవన) మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుక పారిపోయినా తెలియని పాశం వెంటపడి ఋణం తీర్చుకోమంటుంది (2) నీ భుజం మార్చుకో మంటుంది (ఈ జీవన) తాళి కట్టిన మగడు లేడనీ తరలించుకు పోయే మృత్యువాగదూ ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవూ ఆ కన్నీళ్ళకు చితిమంటలుఆరవూ ఈ మంటలు ఆ గుండెను అంటకమానవు (ఈ జీవన) | |
padimAsalu mOsaavu pillalanu bratukaMta mosaavu baadhalanu yinni mOsina ninnu mOsEvaLLulEka veLLutuMnaavu ii jiivanataraMgAlalO aa dEvuni cadaraMgaMlO evariki evaru soMtamu eMtavarakii baMdhamu kaDupu ciMcuku puTTiMdokarU kATiki ninnu mOsEdokarU talaki korivi peTTEdokarU aapaini pOvacEdevarU (aapaini) (ii jiivana) mamatE manishiki baMdikhAnA bhayapaDi teMcuka pAripOyinA teliyani pASaM veMTapaDi RNaM tiircukOmaMTuMdi (2) nii bhujaM mArcukO maMTuMdi (ii jiivana) tALi kaTTina magaDu lEDanii taraliMcuku pOyE mRtyuvAgadU ii kaTTenu kaTTelu kAlcaka mAnavU aa kanniiLLaku citimaMTaluAravU ii maMTalu aa guMDenu aMTakamAnavu (ii jiivana) | |