Mana Ghantasala Song Lyrics

uDatA uDatA hut ekkaDi keLLAv hut

Movie:jiivana tarangAlu (1973)Lyrics:c.narayana Reddy
Music:#J. V.# rAGavuluSingers:ghaMTasaala bRndaM
Submitted by: Krishna Kandadai
ఉడతా ఉడతా హుత్‌ ఎక్కడి కెళ్ళావ్‌ హుత్‌ (2)
కొమ్మ మీది జాంపండు (2)
కోసుకొస్తవా మా బేబీకిస్తావా (ఉడతా)

చిలకమ్మా ఓ చిలకమ్మ
చెప్పేది కాస్త వినవమ్మా (2)
నీ పంచదార పలుకులన్ని (2)
బేబీకిస్తావా మా బేబీకిస్తావా (ఉడతా)

ఉరకలేసే ఓ జింకా
పరుగులాపవె నీ వింక (2)
నువు నేర్చుకున్న పరుగులన్నీ (2)
బేబీకిస్తావా మా బేబీకిస్తావా (ఉడతా)

చిలకల్లారా కొకిళ్ళారా
చెంగులు వేసే జింకల్లారా (చిలక)
చిన్నారి పాపల ముందు
మా చిన్నారి పాపల ముందు
మీరెంత.....హుష్‌ హుష్‌
మీ జోరెంత..హుష్‌ హుష్‌ (ఉడతా)


uDatA uDatA hut ekkaDi keLLAv hut (2)
komma miidi jAMpaMDu (2)
kOsukostavaa mA bEbiikistAvA              (uDatA)

cilakammA O cilakamma
ceppEdi kAsta vinavammA   (2)
nii paMcadAra palukulanni  (2)
bEbiikistAvA mA bEbiikistAvA               (uDatA)

urakalEsE O jiMkA
parugulApave nii viMka   (2)
nuvu nErcukunna parugulannii  (2)
bEbiikistAvA mA bEbiikistAvA               (uDatA)

cilakallArA kokiLLArA
ceMgulu vEsE jiMkallArA                   (cilaka)
cinnAri pApala muMdu
mA cinnAri pApala muMdu
miireMta.....hush hush
mii jOreMta..hush hush       (uDatA)


EDIT