Mana Ghantasala Song Lyrics

pratirAtri vasanta rAtri

Movie:EkavIra (1969)Lyrics:Devulapalli Krishna Sastry
Music:k.v.mahadevanSingers:Ghantasala and S.P.Balasubhramaniam
Submitted by: Krishna Kondaka
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
ప్రతినిమిషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి
ప్రతిరాత్రి వసంత రాత్రి

నీలో నాపాట కదలీ
నాలో నీ అందె మెదలి (2)
లోలోన మల్లె పొదల
పూలెన్నో విరిసి విరిసి (2)
మనకోసం ప్రతి నిమిషం మధుమాసాం కవాలి
మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి
(ప్రతిరాత్రి వసంత రాత్రి)

ఒరిగింది చంద్రవంక
ఒయ్యారి తారవంక (2)
విరజాజి తీగ సుంత
జరిగింది మావిచెంత (2)
ననుజూచీ, నినుజూచీ వనమంతా వలచింది
ననుజూచీ, ప్రియా ప్రియా వనమంతా వలచింది
(ప్రతిరాత్రి వసంత రాత్రి)


pratirAtri vasaMta rAtri
pratigAli pairagAli
bratukaMtA pratinimishaM pATalAga sAgAli
pratinimishaM priyA, priyA pATalAga sAgAli
pratirAtri vasaMta rAtri

niilO nApATa kadalii   
nAlO nii aMde medali   (2)
lOlOna malle podala
poolennO virisi virisi (2)
manakOsaM prati nimishaM madhumAsAM kavaali
manakOsaM priyA, priyA madhumAsaM kAvAli
(pratirAtri vasaMta rAtri)

origiMdi caMdravaMka 
oyyAri tAravaMka  (2)
virajAji tiiga suMta 
jarigiMdi mAviceMta  (2)
nanujUcI, ninujUcI vanamaMtA valaciMdi
nanujUcI, priyA priyaa vanamaMtA valaciMdi
(pratirAtri vasaMta rAtri)