Mana Ghantasala Song Lyrics

nuvvU nEnU naDichEdi okE bATa okE bATa avunA?

Movie:Dabbuku lOkam dAsOham (1973)Lyrics:?
Music:?Singers:ghaMTasaala, suSeela
Submitted by: Sreenivas Paruchuri
అ : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట అవునా?
ఆ: నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట

అ : ఆ బాట ఏనాడు తిరుగులేనిది
ఆ: ఆ మాట ఏనాడు తీరిపోనిది

అ : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట

అ : దూరాన శిఖరాలు ఉన్నాయి
వాటిని చేరుకునే పాదాలను రంమన్నాయి
ఆ: తూరుపున కిరణాలు ఉదయించాయి (2)
గగన తీరాలను అందుకోను పయనించాయి (2)
అ : మరి మన పయనం ఎందాక ఎందాక
ఆ: ఆ శిఖరాలు తీరాలు అందేదాక

జం : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట

అ : చిరుగాలిలో ఎవో నాదాలు ఉన్నాయి
ఆ: అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి
అ : వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి (2)
ఆ: అవి ముత్తెపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి
అ : మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు
జం : మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు

అ : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట
ఆ: నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట


a :	nuvvU nEnU naDichEdi okE bATa okE bATa   avunA?
aa: 	nuvvU nEnU palikEdi okE mATa okE mATa

a : 	aa bATa EnADu tirugulEnidi
aa: 	aa mATa EnADu tIripOnidi

a : 	nuvvU nEnU naDichEdi okE bATa okE bATa

a : 	doorAna SikharAlu unnAyi
vATini chErukunE pAdAlanu raMmannAyi
aa: 	toorupuna kiraNAlu udayiMchAyi (2)
gagana tIrAlanu aMdukOnu payaniMchAyi (2)
a : 	mari mana payanaM eMdAka eMdAka
aa: 	aa SikharAlu tIrAlu aMdEdAka

jaM : 	nuvvU nEnU naDichEdi okE bATa okE bATa

a : 	chirugAlilO evO nAdAlu unnAyi
aa: 	avi muraLilO chEritEnE rAgAlu avutAyi
a : 	vAna chinukullO kanarAni taLukulu unnAyi (2)
aa: 	avi muttepu chippallO paDitEnE mutyAlu avutAyi
a : 	maMchi aaSayAluMTE mAnavulaMdaroo machcha lEni velugunE chErukuMduru
jaM : 	maMchi aaSayAluMTE mAnavulaMdaroo machcha lEni velugunE chErukuMduru

a : 	nuvvU nEnU naDichEdi okE bATa okE bATa
aa: 	nuvvU nEnU palikEdi okE mATa okE mATa