|
Mana Ghantasala Song Lyrics |
| Movie:malleeSwari | Lyrics:Devulapalli Krishna Sastry |
| Music:S Rajeswara Rao | Singers:Ghantasala and Bhanumathi |
| Submitted by: Neeraja | |
|
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్ని తిరిగిచూసేవు... ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘమాల ఆ.. చందాల ఓ మెఘమాల గగన సీమల తేలు ఓ మేఘమాల మావూరు గుడిపైన మసలి వస్తున్నావా మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాల ఓ మేఘమాలా మమతలెరిగిన మేఘమాలా నా మనసు బావకు చెప్పిరావా ఎన్నాళ్లు నాకళ్లు దిగులుతో రేపవలు ఎదురు తెన్నులు చూచేనే బావకై చెదరి కాయలు కాచెనే నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాలా ఓ మేఘమాలా మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని మల్లిరూపె నిలిచేనే నా చెంత మల్లి మాటే పిలిచేనే జాలి గుండెల మేఘమాలా బావ లేనిది బ్రతుకజాల కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వాన జల్లుగ కురిసిపోవా కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల | |
aakASavIdhilO haayigaa egirEvu dESa dESaalanni tirigichUsEvu... EDa taanunnADO baavaa jaaDa telisina pOyiraavaa aMdaala O mEghamaala aa.. chaMdaala O meghamaala gagana sImala tElu O mEghamAla mAvUru guDipaina masali vastunnaavaa malli maaTEdaina naatO manasu challagaa cheppipOvaa neelaala O mEghamaalaa aa.. raagaala O mEghamaalaa mamatalerigina mEghamaalaa naa manasu baavaku cheppiraavaa ennALlu naakaLlu digulutO rEpavalu eduru tennulu chUchEnE bAvakai chedari kAyalu kAchenE nIlaala O mEghamAlA aa.. raagaalaa O mEghamAlA manasu telisina mEghamaalaa maruvalEnani cheppalEvaa mallitO maruvalEnani cheppalEvA kaLlu terachinagAni kaLlu mUsinagaani mallirUpe nilichEnE nA cheMta malli mATE pilichEnE jaali guMDela mEghamAlaa bAva lEnidi bratukajAla kuriyu naa kannIru guMDelO daachukuni vAna jalluga kurisipOvaa kannIru aanavaaluga bAva mrOla | |