|
Mana Ghantasala Song LyricsmuripiMchE aMdaalE avi nannE cheMdaalE |
| Movie:bobbili yuddham (1964) | Lyrics:SriiSrii |
| Music:sAlUri | Singers:ghaMTasaala, suSIla |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
సొగసు కేల్జడదానా సోగ కన్నులదానా వజ్రాలవంటి పల్వరుసదానా బంగారుజిగిదానా సింగారములదానా నయమైన పయ్యదలదానా తోరంపుకటిదానా తొణకి సిగ్గులదానా పిడికిట నడుగునెల్ నడుముదానా మురిపించే అందాలే అవి నన్నే చెందలే (2) నా దానవు నీవెలె నీవాడను నెనేలే దారిచేర రావే సఖి నా సఖి ప్రేయసి సిగ్గేల మరపించే మురిపాలే కరిగించే కెరటాలై నిదురించే భావాలా కదిలించే ఈవేళా అదే హాయికాదా? సఖా నాసఖా! (మురిపించె) చెలి తొలిచూపే మంత్రించినే ప్రియసఖురూపే మదినేలెనే (2) ఇది యెడబాటు కనలేని ప్రేమ ఇల మనకింక సురలోక సీమ (2) ఇదే హాయి కాదా సఖా నాసఖా (మురిపించె) అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో (2) మధుమాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే (2) దరిచేరరావే సఖీ నాసఖీ! (మురిపించె) | |
sogasu kEljaDadAnA sOga kannuladAnA vajrAlavaMTi palvarusadAnA baMgArujigidAnA siMgAramuladAnA nayamaina payyadaladAnA tOraMpukaTidAnA toNaki sigguladAnA piDikiTa naDugunel naDumudAnA muripiMcE aMdAlE avi nannE ceMdalE (2) naa daanavu nIvele nIvaaDanu nenElE daarichEra rAvE sakhi naa sakhi prEyasi siggEla marapiMcE muripAlE karigiMcE keraTAlai niduriMcE bhAvAlA kadiliMcE iivELA adE hAyikAdA? saKA nAsaKA! (muripiMche) celi tolicUpE maMtriMcinE priyasaKurUpE madinElenE (2) idi yeDabATu kanalEni prEma ila manakiMka suralOka sIma (2) idE hAyi kAdA saKA nAsaKA (muripiMche) anurAgAla rAgAlalO nayagArAla gArAlalO (2) madhumAdhuryamE niMDipOyE hRdayAnaMdamE poMgipOyE (2) daricErarAvE saKI nAsaKI! (muripiMche) | |