|
Mana Ghantasala Song LyricsevarO vastArani, EdO cEstArani |
| Movie:bhoomikOsam (1974) | Lyrics:SriiSrii |
| Music:penDyAla | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna Kandadai | |
|
భూమికోసం భుక్తికోసం సాగే రైతుల పోరాటం అనంత జీవిత సంగ్రామం రాజులు మారి, రోజులుమారి పాలన చేసే పధ్ధతి మారి మారని దొకటేరా - అది దున్నే రైతుల బ్రతుకేరా సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి మారని దొకటేరా - అది పేదల ఆకలి మంటేరా భూమికోసం భుక్తికోసం తూరుపు దిక్కున వీచే గాలి పడమటి కడలిని పిలిచే గాలి తూరుపు పడమర లేకంచేసే తుఫానులా చెలరేగేదాకా భూమికోసం భుక్తికోసం సాగే రైతుల పోరాటం అంతంకాదిది ఆరంభం భూమికోసం భుక్తికోసం | |
bhUmikOsaM bhuktikOsaM sAgE raitula pOrATaM anaMta jiivita saMgrAmaM rAjulu mAri, rOjulumAri pAlana cEsE padhdhati mAri mArani dokaTErA - adi dunnE raitula bratukErA saMpada peMcE tiirulu mAri paMpakAlalO riitulu mAri mArani dokaTErA - adi pEdala aakali maMTErA bhUmikOsaM bhuktikOsaM tUrupu dikkuna viicE gAli paDamaTi kaDalini pilicE gAli tUrupu paDamara lEkaMcEsE tufAnulA celarEgEdAkA bhUmikOsaM bhuktikOsaM sAgE raitula pOrATaM aMtaMkAdidi aaraMbhaM bhUmikOsaM bhuktikOsaM | |
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిదురపోకుమా ఎవరో వస్తారని, ... బడులేలేని పల్లెటూళ్ళలో చదువేరాని పిల్లలకు, చవుడు రాలే చదువుల బడిలో జీతాల్రాని పంతుళ్ళకూ (ఎవరో) చాలీ చాలని పూరిగుడిసెలో కాలేకడుపుల పేదలకు, మందులులేని ఆసుపత్రిలో పడిగాపులు పడు రోగులకు (ఎవరో) తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు, అజ్నానానికి అంయాయానికి బలియైపోయిన పడతులకు (ఎవరో) కూలిడబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశా జీవులకు దురలవాట్లతో బాధ్యత మరచి చెడే నిరాశా జీవులకు (ఎవరో) సేద్యంలేని బీడునేలలో పనులే లెని ప్రాణులకు పగలూ రేయీ శ్రమపడుతున్నా అలితం దక్కని దీనులకు (ఎవరో)